helicopter money: హెలికాప్టర్ మనీ: ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వాలనుకుంటున్న న్యూజిలాండ్ – new zealand mulls giving free cash directly to people amid covid-19 crisis

APNEWS CO
Read Time4 Minute, 49 Second


కాశం నుంచి ఎవరైనా నోట్ల కట్టలు వెదజల్లితే ఎంత బాగుండేదో.. లాక్‌డౌన్‌తో కుదేలై, జీవితాలు తలకిందులైన వేళ అనేక మంది ఇలా అనుకుంటున్నారు. సంక్షోభ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేయించి జనానికి పంచితే బాగుండేది కదా అనేది మరో ఆలోచన. అంటే ప్రజలకు డబ్బులు ఉచితంగా ఇవ్వడం. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘హెలికాప్టర్ మనీ’ అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి దీని గురించి తొలిసారిగా ప్రస్తావించడంతో ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. తాజాగా న్యూజిలాండ్ ప్రభుత్వం తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి హెలికాప్టర్ మనీని మార్గంగా ఎంచుకున్నట్లు ప్రకటించడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన వేళ.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికే పలు దేశాలు ఉద్దీపన చర్యలు చేపట్టాయి. ఆత్మ నిర్భర అభియాన్ భారత్ పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజలకు రూ.20 లక్షల కోట్ల రూపాలయతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. తాజాగా న్యూజిలాండ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రజలకు నేరుగా డబ్బు అందించే ‘హెలికాప్టర్‌ మనీ’ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఇది సంప్రదింపుల దశలోనే ఉందని న్యూజిలాండ్ ఆర్థిక మంత్రి గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌ తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విధానంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం న్యూజిలాండ్ ప్రభుత్వం అనుసరించిన కఠిన చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత త్రైమాసికంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 21.8% కుచించుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ మనీ విధానం ఓ వరంగా మారుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

లాక్‌డౌన్‌తో ఏర్పడిన భారీ లోటును పూడ్చడానికి రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌ ఇప్పటికే దేశ అధికారిక నగదు రేటును భారీగా తగ్గించింది. దీంతో పాటు బాండ్లను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని రెట్టింపు చేసింది. హెలికాప్టర్‌ మనీ విధానం ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చే డబ్బు ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన న్యూజిలాండ్‌కు ఎంతో దోహదపడుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది.

అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త ఫ్రెడ్‌మ్యాన్‌ 1969లో హెలికాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించారు. కరోనా వైరస్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా హెలికాప్టర్ మనీ విధానాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల‌ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. దీంతో దేశంలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. హెలికాప్టర్ మనీ విధానంపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుదీర్ఘకాలం ద్రవ్యోల్బణం కొనసాగే ప్రమాదం ఉన్నందున చాలా ధనిక దేశాలు కూడా దీన్ని అమలు చేయడానికి సంకోచిస్తాయని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Also Read:వీధి వ్యాపారిని దోచుకున్న జనం.. రాజధాని నడిబొడ్డున దారుణం

Don’t Miss:పెళ్లి విడదీసింది.. కరోనా కలిపింది!Source link

0 0
Next Post

mayday meaning: పాక్ విమాన ప్రమాదం: పైలట్ చివరి మాటలు.. మేడే అంటే? - mayday, mayday: last words of pilot in pakistan plane cockpit audio; here is mayday, belly landing means

పాకిస్థాన్ విమానయాన చరిత్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దేశమంతా రంజాన్‌ పండుగకు సిద్ధమవుతుండగా.. అందులోనూ రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన సమయాన కనీవిని ఎరుగని విమాన ప్రమాదం జరిగింది. కరాచీ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఓ విమానం జనావాసాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 99 మంది ప్రయాణికులతో పాటు 8 మంది క్ర్యూ […]