hanmakonda sex racket: హన్మకొండ బస్టాండ్ పక్కనే వ్యభిచారం.. పోలీసుల అదుపులో విటులు, మహిళలు – sex racket busted in hanmakonda near bus stand, 3 arrested

admin
Read Time46Seconds


హన్మకొండ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు చేధించారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని హన్మకొండలో బస్టాండ్ పక్కనే ఉన్న అన్నపూర్ణ లాడ్జిలో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో హన్మకొండ ఎస్ఐ రవీందర్ సిబ్బందిని అప్రమత్తం చేసి మంగళవారం లాడ్జిలో రైడ్ చేశారు.


Also Read:
విదేశీ మహిళలతో వ్యభిచారం.. ఒక్కరాత్రికే రూ.60వేలట!

ఈ సందర్భంగా లాడ్జి గదుల్లో కొన్ని జంటలు అభ్యంతరకర రీతిలో పట్టుబడ్డాయి. పోలీసులు ఇద్దరు విటులతో పాటు వ్యభిచార నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన మహిళలను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళలంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు, నర్సంపేట, పాలకుర్తి ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు.

Also Read:
బెంగాల్ బాలికలతో గుట్టుగా వ్యభిచారం…ఇద్దరు బ్రోకర్లు, నలుగురు విటుల అరెస్ట్

ఆయా ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న దుండగులు వారిని మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరు ఎక్కువగా వివాహితలనే టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. భర్త సంపాదనతో తృప్తి చెందని వారిని మాయమాటలతో ముగ్గులోకి దించి సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని చెబుతున్నారు. రైడ్‌లో పట్టుబడిన విటులు, వ్యభిచార నిర్వాహకుడిని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. లాడ్జిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన యజమానిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read:
గెస్ట్‌హౌస్‌లో మైనర్ బాలికలతో వ్యభిచారం.. ఆరుగురు విటుల అరెస్ట్





Source link

0 0
Next Post

human trafficking in pakistan: పాక్: 629 మందిని పెళ్లిపేరుతో చైనాకు అమ్మేసి బలవంతంగా వ్యభిచారం! - trafficking networks in pakistan, 629 girls and women from across country sold as brides to china

పేదరికాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లి పేరుతో పెద్ద ఎత్తున మహిళలను అక్రమంగా పాకిస్థాన్ నుంచి చైనాకు తరలించి, వారిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 629 మంది మహిళలను పెళ్లి పేరుతో చైనా ముఠాలకు అమ్మేసినట్టు పాకిస్థాన్ అధికారుల దర్యాప్తు నివేదిక అసోసియేటెడ్ ప్రెస్‌కు చిక్కింది. ఈ నివేదిక ప్రకారం.. 2018 నుంచి అక్రమరవాణా చిక్కుకున్న బాధితుల సంఖ్య […]