guntur army jawan suicide : ​ప్రియురాలి తల్లిపై కాల్పులు.. రైలు కింద పడి మాజీ జవాన్ ఆత్మహత్య​ – army ex jawan balaji commits suicide in guntur district

admin
Read Time47Seconds


గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నడింపల్లి గ్రామంలో మహిళపై కాల్పులు జరిపి పరారైన బాలాజీ అనే ఆర్మీ మాజీ జవాన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన గమనించిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.


Also read:
15ఏళ్లు పెద్దదైన ఆంటీతో అఫైర్.. భార్య ఎదుటే ప్రియురాలిని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన యేమినేని బాలాజీ గతంలో ఆర్మీలో పనిచేసేవాడు. అదే మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన రమాదేవి కుమార్తెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా నీకు నాకు సంబంధం లేదని మాటమార్చాడు. దీంతో మోసపోయానని భావించిన యువతి గతేడాది డిసెంబర్ 11 బాపట్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడంతో ఆర్మీ బాలాజీని సస్పెండ్ చేసింది.

Also read:
ఓయో హోటల్‌లో వ్యభిచారం గుట్టురట్టు.. ఇద్దరు సెక్స్‌వర్కర్ల అరెస్ట్

తన ఉద్యోగం పోయి జీవితం నాశనం కావడానికి యువతి, ఆమె తల్లే కారణమని భావించిన బాలాజీ శుక్రవారం రాత్రి స్నేహితుడితో కలిసి యువతి ఇంటికొచ్చాడు. తలుపు తట్టగా యువతి తల్లి రమాదేవి బయటకు వచ్చింది. దీంతో తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో చెవికి తూటా తగిలింది. బాధితురాలి కేకలతో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు.

Also read:
17ఏళ్ల బాలుడితో ఆంటీ అఫైర్.. రైల్వే ట్రాక్ పక్కన నగ్నంగా

ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న బ్యాగ్‌, తుపాకీ సంఘటనా స్థలంలో వదిలేశాడు. సమాచారం అందుకున్న చెరుకుపల్లి ఎస్సై పి.రమేష్‌ ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన బాధితురాలిని గుళ్లపల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న బాలాజీ కోసం పోలీసులు గాలిస్తుండగానే అతడు తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చెరుకుపల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also read:
ఆ లేడీటీచర్ కామపిశాచి… యువకులు, రాజకీయ నేతలతో అఫైర్లు, భర్తకు భోజనంలో విషం పెట్టి..

ఆత్మహత్యా? హత్యా?

బాలాజీ మృతిపై అతడి తల్లిదండ్రులు బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలాజీని యువతి బంధువులే హత్య చేసి రైలు పట్టాలపై పడేశారని ఆరోపిస్తున్నారు. అతడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

Also read:
‘వాడి కోరికలు తీర్చలేక చచ్చిపోతున్నా’.. కోనసీమ యువతి సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు

Source link

0 0
Next Post

sex rocket in massage centers : మసాజ్‌ మాటున సెక్స్.. నగరంలో గుట్టుగా వ్యభిచార దందా! - sex rocket in spa centers in bengaluru, police arrests owner

బెంగళూరు నగరంలో విలాసవంతంగా కనిపించే ఓ స్పా మాటున వ్యభిచారం జరుగుతోంది. గుట్టుగా జరుగుతున్న ఈ దందాను బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలోని మహదేవపుర ప్రాంతంలోని హూడీ ప్రాంతంలో నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌లో రహస్యంగా ఆరుగురు మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి వ్యభిచారం రొంపి […]