ex lover’s son kidnap : తల్లిని రప్పించేందుకు కొడుకు కిడ్నాప్.. ఆమె మాజీ ప్రియుడే.. – mother’s ex lover abducts 4 year old boy in ghaziabad

admin
Read Time45Seconds


ప్రియురాలిని తన ఇంటికి రప్పించేందుకు ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమె నాలుగేళ్ల కొడుకుని కిడ్నాప్ చేశాడు. ఆడుకోవడానికి వెళ్లిన కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులకు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న భార్యకి తెలిసిన వ్యక్తే కొడుకుని కిడ్నాప్ చేసినట్లు తెలియడంతో అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు.


ఘజియాబాద్‌లోని కృతి విహార్‌కి చెందిన రోషిణీ దేవికి ఫరూఖాబాద్‌కి చెందిన ముకేష్ కుమార్‌తో 2008లో వివాహమైంది. వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె పిల్లలతో సహా ఘజియాబాద్‌లోని పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలసి నివాసముంటోంది. ఆమె నాలుగేళ్ల కొడుకు ఆడుకుంటానని చెప్పి బయటికి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో కంగారుపడిని రోషిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:
ప్రియుడితో ఇంట్లోనే కూతురి రాసలీలలు.. తల్లి చూసిందని కళ్లలో కారంకొట్టి..

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీశారు. ఫరూఖాబాద్‌లో ఉంటున్న భర్త ముకేష్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన ఆజాద్‌పై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదు చేసింది. ఆజాద్ ఎవరని ఆరా తీయగా రోషిణీ అతనితో సహజీవనం చేసినట్లుగా తేలింది. భర్త నుంచి విడిపోయిన రోషిణి గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ మూడు నెలలపాటు ఆజాద్‌తో కలసి ఒకే ఇంట్లో ఉంది. ఆ తరువాత అతని నుంచీ దూరమైంది.

Read Also:
వైద్యం చేయిస్తే డబ్బులైపోతాయని కన్నకూతురినే.. సంగారెడ్డిలో దారుణం

ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆజాద్ ఘజియాబాద్‌లోనే ఉంటున్నట్లు గుర్తించారు. ఆమె ఇంటికి సమీపంలోనే ఉన్న వికాస్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇంటిని చుట్టుముట్టి అతని నుంచి ఆమె కొడుకుని రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఎలాగైనా రోషిణీని తన ఇంటికి రప్పించాలనే ఆమె కొడుకుని కిడ్నాప్ చేశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.





Source link

0 0
Next Post

FATHER RAPES DAUGHTER : కూతురిపై కన్నేసిన కామాంధుడు.. తండ్రి కారణంగా బిడ్డకు ప్రసవం.. ఘోరం - minor girl delivers baby after father rapes her in punjab

కన్నకూతురిపైనే కన్నేశాడో కామాంధుడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో కూతురిని కాటేశాడు. నిత్యం లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో కూతురిపై తరచూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కడుపునొప్పితో బాధపడుతోందని బాలికను ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఆమె ఇప్పుడు ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పదిహేనేళ్ల బాలికను కన్నతండ్రే తల్లిని చేసిన దారుణ […]