EU resolution on CAA : ఈయూలో సీఏఏ వ్యతిరేక తీర్మానం.. కీలకంగా వ్యవహరించిన పీఓకే సంతతి వ్యక్తి! – pok-origin british member behind anti-caa move in european parliament

admin
Read Time4 Minute, 10 Second


పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై యూరోపియన్ యూనియన్‌ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన సభ్యులతో ఆమోదం పొందిన ఓ చట్టాన్ని ప్రశ్నించడం సరైన చర్య కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ అంశం పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని భారత్ తేల్చి చెప్పింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సవివర చర్చ అనంతరం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులు చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తుచేసింది. తీర్మానాలు ప్రవేశపెట్టిన సభ్యులు తొలుత భారత్‌తో సంప్రదింపులు జరపాలని, చట్టంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించింది.


సీఏఏకి వ్యతిరేకంగా ఐరోపా సమాఖ్యలో పలువురు సభ్యులు తీర్మానాలు ప్రవేశపెట్టారు. దీనిపై వచ్చే బుధవారం ఈయూ పార్లమెంట్‌ చర్చ చేపట్టనుంది. మర్నాడు ఈ తీర్మానాలపై ఓటింగ్‌ నిర్వహించనున్నారు. సీఏఏ వివక్షపూరితంగా ఉందని.. దీనిపై ఆందోళనలు చేస్తున్నవారితో ప్రభుత్వం చర్చలు జరిపాలని తీర్మానాల్లో పేర్కొన్నారు. సీఏఏ వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఏ వర్గంపైనా వివక్ష చూపదని స్పష్టం చేసింది. అయినా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

కాగా, ఐరోపా పార్లమెంట్‌లో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక పాక్ ఆక్రమిత కశ్మీర్ సంతతికి చెందిన బ్రిటన్ సభ్యుడు షఫాక్ మహ్మద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. పీఓకేలోని మిర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన షఫాక్ మహ్మద్ 2019 నుంచి యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజకీయ సేవలకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ అంపైర్ పురస్కారాన్ని 2015లో షఫాక్ అందుకున్నారు.

ఇక, ఈయూ పార్లమెంట్‌లో 751 మంది సభ్యులుండగా సీఏఏకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి 154 మంది మద్దతు తెలుపుతున్నారు. బ్రిటన్ రాజకీయాలు, ఇండో-పాక్ సంబంధాల గురించి అవగాహన కలిగిన షఫాక్.. సీఏఏ వ్యతిరేక తీర్మానం ఈయూలో ప్రవేశపెట్టడంలో పాక్ హస్తం ఉందనేది తోసిపుచ్చలేం. మొత్తం ఐదు పేజీలతో కూడిన ఈ తీర్మానంలో పౌర, రాజకీయ హక్కులు, ఇతర మానవ హక్కుల ఒప్పందాలపై అంతర్జాతీయ ఒడంబడికలను భారత్ విస్మరిస్తోందని ఆరోపించారు.

Source link

0 0
Next Post

khammam gang rape : కటకటాల్లోకి కామాంధులు.. ఖమ్మం గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురి అరెస్ట్ - seven gang rape accused arrested in khammam

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో శుక్రవారం రాత్రి వివాహితపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలోనే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన ఆరుగురిని ఆదివారం అరెస్ట్ చేశారు. Also Read: వివాహితను ఎత్తుకెళ్లి పత్తి చేలో ఏడుగురి గ్యాంగ్ రేప్.. ఖమ్మంలో దారుణం రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహిత(35) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. రాత్రి […]