Dubai: సెక్స్ కోసం ఎగబడి వెళ్తే నిలువుదోపిడీ చేశారు.. వ్యాపారవేత్తకు చేదు అనుభవం – 3 women jailed for robbing iraqi business man after luring him for sex in dubai

admin
Read Time4 Minute, 24 Second


ఇరాక్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను సెక్స్ పేరుతో ఆకర్షించిన ఓ మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి అతడిని దోచుకున్న ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు అతడితో చాట్ చేసిన మహిళ ఓ రోజు తన ప్లాట్‌లో ఎవరూ లేరు.. నువ్ వస్తే రెచ్చిపోదామంటూ ఊరించే మాటలతో రెచ్చగొట్టి రప్పించింది. ఎంతో ఆశతో అక్కడికి వెళ్లిన అతడికి ఐదుగురు నైజీరియన్ మహిళలు చుక్కలు చూపించారు.


Also Read:
ప్రియురాలు, ఆమె ముగ్గురు కూతుళ్లను చంపి శవాలతో సెక్స్… నరరూప రాక్షసుడికి నాలుగు జీవితఖైదులు

ఇరాక్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ ఏడాది ఏప్రిల్‌లో వ్యాపార పనుల నిమిత్తం షార్జా వెళ్లాడు. అక్కడ అతడికి స్వీడిష్ విద్యార్థినంటూ ఓ మహిళ ఆన్‌లైన్లో పరిచయం ఏర్పరచుకుంది. కొద్దిరోజుల తర్వాత చనువు పెరగడంతో పర్సనల్‌గా కలుద్దామంటూ అతడికి ఆఫరిచ్చింది. దీంతో దుబాయ్‌లో ఆమెను కలిసి అక్కడికి షార్జా వెళ్దామని ప్లాన్ చేసుకున్న ఆ వ్యాపారవేత్త ఇరాక్ నుంచి భారీగా నగదు తీసుకుని ఆమె దగ్గరికి వెళ్లాడు.

Also Read:
వైజాగ్‌లో హైటెక్ వ్యభిచారం.. విమానాల్లో వచ్చి లగ్జరీ హోటళ్లలో దందా

ఫ్లాట్‌లోకి వెళ్లగానే ఐదుగురు ఆఫ్రికన్ మహిళలు కనిపించడంతో ఉత్సాహంగా వచ్చిన ఆ వ్యాపారవేత్త నీరుగారిపోయాడు. వారంతా అతడిని చితకబాది ఓ గదిలో బంధించారు. అతడి వద్దనున్న నగదు మొత్తాన్ని దోచుకున్నారు. వారి చేతిలో తనకు చావు తప్పదని భావించిన అతడు తనకు శ్వాస సంబంధిత వ్యాధి ఉందని, విడిచి పెట్టాలని వేడుకోవడంతో వారు అతడికి విముక్తి కల్పించారు. క్యాబ్‌కు డబ్బులు లేవని చెప్పడంతో ఓ మహిళ 600 దిర్హామ్స్ ఇచ్చింది.

Also Read:
డేటింగ్ పేరుతో చీటింగ్.. రూ.8కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

దీంతో అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వ్యాపారవేత్త జరిగిన విషయమంతా పోలీసులకు చెప్పాడు. పోలీసులు బాధితుడిని తీసుకుని ఆ ఫ్లాట్‌కు వెళ్లగా ఇద్దరు మహిళలు తప్పించుకుని పారిపోయారు. మిగిలిన ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు నిందితులు ఒక్కొకక్కరికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత వారు తమ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

Also Read:
ప్రియురాలికి చివరి గిఫ్ట్‌గా బాటిల్ రక్తం పంపించి చెన్నై యువకుడి ఆత్మహత్య

Source link

0 0
Next Post

fan gifted cheppals to pawan kalyan: పవన్ క్రేజ్.. చెప్పులు బహుమానంగా ఇచ్చిన అభిమాని - fan gifted cheppals to janasena chief pawan kalyan in amaravati

ఎన్నికల్లో జనసేన అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి కేవలం ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటికీ యువతలో పవన్ కళ్యాణ్ పట్ల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. జనసేనాని అమరావతి ప్రాంత పర్యటన సందర్భంగా ఈ విషయం రుజువైంది. రెండ్రోజుల అమరావతి పర్యటన కోసం.. పవన్ పార్టీ కార్యాలయం […]