Delhi firing: భర్త తలలో నుంచి భార్య మెడలోకి.. దూసుకెళ్లిన బుల్లెట్ – man shoots self, bullet through his head and hits wife in delhi

APNEWS CO
Read Time2 Minute, 50 Second


ఒకే బుల్లెట్ ఇద్దరి శరీరాల్లో నుంచి దూసుకెళ్లిన ఘటనలు సినిమాల్లో చూసే ఉంటాం. కానీ అదే నిజజీవితంలో జరిగితే.? అదే జరిగింది. నిజంగానే ఒకే బుల్లెట్ ఇద్దరి శరీరాల్లో నుంచి దూసుకెళ్లింది. ఆత్మహత్య చేసుకుందామని భర్త తలలో తుపాకీతో కాల్చుకుంటే.. బుల్లెట్ తలలో నుంచి బయటికి వచ్చి భార్య మెడలోకి దూసుకెళ్లింది. ఈ ఆశ్యర్యకర, విషాద ఘటన ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.

ఫరీదాబాద్‌కి చెందిన జంట ఐదునెలల కిందట గురుగ్రామ్‌కి వచ్చి నివాసం ఉంటోంది. కొద్ది నెలలుగా భర్త ఏ ఉద్యోగం చూసుకోకుండా ఖాళీగా ఇంట్లోనే ఉండడం భార్యకు కోపం తెప్పించింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య ఏడు నెలల గర్భిణి కావడంతో వైద్య పరీక్షల కోసం కారులో బయల్దేరారు.

Also Read: గురితప్పిన గుండు ప్రాణాలు తీసింది.. విషాదం

ఉద్యోగం విషయమై కారులో మరోసారి గొడవ జరగడంతో ఆమెను పుట్టింట్లో వదిలిపెడతానని భర్త చెప్పాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో ఆగ్రహం చెందిన భర్త రాంపురా ఓవర్ బ్రిడ్జి వద్ద కారు ఆపి తుపాకీ తీసి ఆత్మహత్యా యత్నం చేశాడు. తలకు గురిపెట్టుకుని ఒక్కసారిగా ట్రిగ్గర్ నొక్కాడు. అతని చెవిలో నుంచి దూసుకెళ్లిన బుల్లెట్ తలలో నుంచి బయటికొచ్చింది. పక్క సీట్లో కూర్చుని ఉన్న భార్య మెడలోకి దూసుకెళ్లింది.

బుల్లెట్ గాయాలతో ఇద్దరూ కారులో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. భార్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

Read Also: వియ్యానికెళ్లి కయ్యానికి దిగిన పేరెంట్స్.. మనస్థాపంతో ప్రేమజంట..



Source link

0 0
Next Post

Pakistan plane crash: పాక్ విమాన ప్రమాదం: బయటపడ్డ ఇద్దరి భయానక అనుభవాలు.. - pakistan plane 'jolted' thrice before crash, says survivor

పాకిస్థాన్ విమానయాన చరిత్రలోనే ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 99 మందిలో 97 మంది మరణించారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం నుంచి వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆస్పత్రిలో కోలుకుంటున్న వారు మీడియాతో చెప్పిన మాటలు..   Source link