Coronavirus In India : స్వదేశానికి వచ్చిన ఆ 15 లక్షల మందిపై నిఘా ఉంచండి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం – centre letter to states , 15 lakh who flew back to india between jan 18-mar 23 under lens

admin
Read Time6 Minute, 4 Second


దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కేంద్ర నిషేధం విధించింది. కాగా, జనవరి 18 నుంచి మార్చి 23 వరకు విదేశాల నుంచి 15 లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో కొంత మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించలేదని, అలాంటి వారిని గుర్తించి తక్షణమే క్యారైంటైన్‌కు తరలించిన కరోనా వైరస్ ట్రాన్స్‌మిటర్లుగా మారకుండా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ లేఖ రాశారు.


విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించినా, కొందరు మాత్రం దీనిని పాటించడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించాలని కేంద్రం కోరింది. విదేశాల నుంచి వచ్చి, ఇప్పటికే 14 రోజుల క్యారంటైన్ పూర్తిచేసినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్క్రీనింగ్ పరీక్షలు, స్వీయ నిర్బంధం పాటించనివారే వైరస్ వ్యాప్తికి కారకులని, అలాంటి వారిని తప్పనిసరిగా గుర్తించాలని సూచించింది.

కోవిడ్ -19 కోసం పర్యవేక్షణ కోసం వివిధ దేశాల నుంచి వచ్చిన 15 లక్షలకుపైగా అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖకు చెందిన ఇమ్మిగ్రేషన్ బ్యూరో అందజేసిందని క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గబ్బా చెప్పారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే పరిశీలనలో ఉన్నారని, దేశంలో వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడం ముఖ్యమని ఆయన అన్నారు. విదేశాల నుంచి ముఖ్యంగా మార్చిలో స్వదేశానికి వచ్చినవారి గురించి డేగ కళ్లతో పరిశీలిస్తున్నామని తెలిపారు.

భారతదేశానికి చేరుకున్న వారు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ నిఘా కార్యక్రమంలో ఉండాల్సిన అవసరం ఉందని, తద్వారా ఉపద్రవం నుంచి బయటపడతారని అధికారులు హామీ ఇస్తున్నారు. ఇలాంటి వారిని తక్షణమే రాష్ట్రాలు ప్రభుత్వాలు గుర్తించి, వైరస్ వ్యాప్తిని కట్టడిచేయాలని కేంద్రం పేర్కొంది. విదేశాల నుంచి ఎంత మంది వచ్చారో ఖచ్చితంగా తక్షణమే గుర్తించి, వారిని క్యారంటైన్‌కు తరలించి వైరస్‌ను వ్యాప్తిని అడ్డుకోవాలని రాజీవ్ గబ్బా వివరించారు. మరోవైపు, దేశంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సమూహాల్లో వ్యాప్తిచెందినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ప్రకటించింది.

వైరస్ కేసుల సంఖ్య పెరిగినా, పెరుగుదల నిష్పత్తి మాత్రం నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయాన్ని కూడా రాజీవ్ గబ్బా ప్రస్తావించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని పదేపదే నొక్కిచెప్పినట్లు తాను అర్థం చేసుకున్నానని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలితన ప్రాంతాలను ఆయన కోరారు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. అంతర్జాతీయ ప్రయాణీకుల కదలికలపై తక్షణమే నిఘా ఉంచి, నిరంతర చర్యలు జరిగేలా చూడాలని గబ్బా తన లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత తొలిసారి శుక్రవారం అత్యధికంగా 150కిపైగా కేసులు నమోదుకావడం ఆందోళన గురిచేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం దేశంలో శనివారం ఉదయానికి 834 కేసులు నమోదయ్యాయి. అనధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 886కు చేరింది.

Source link

0 0
Next Post

Physical education teachers in Andhra Pradesh to assist cops in coronavirus fight- The New Indian Express

Express News Service ONGOLE: The district authorities are going to utilise the services of Physical Education Teachers (PETs) to combat the spread of COVID-19 in Prakasam. All PETs and Physical Directors (PDs) have been directed to report to their nearby police station House Officers (SHOs) immediately. These PETs are going […]