Coronavirus cases in India: నిన్న ఒక్క రోజే కొత్తగా 6,300 మందికి కరోనా.. అత్యధికంగా మహారాష్ట్రలో 2,940 కేసులు – fourth peak in daily cases 6,300+ new covid cases, nearly 3k from maharashtra; 140 deaths

APNEWS CO
Read Time5 Minute, 40 Second


దేశంలో కరోనా రక్కసి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,339 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 3వేలు కేసులు నమోదుకావడం గమనార్హం. అక్కడ గతవారం రోజుల నుంచి రోజుకు 2వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 3వేల మార్క్‌కు దగ్గరగా నమోదుకావడం విశేషం. దేశవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 1.24 లక్షలు దాటింది. కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో ఇరాన్ తర్వాతి భారత్ 11వ స్థానంలో నిలిచింది. శుక్రవారం మరో 140 మంది కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడటంతో, మొత్తం మరణాల సంఖ్య 3,726కి పెరిగింది.

మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 36 శాతం ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 44,500 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 27,251 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 2,940 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ ఓ రాష్ట్రంలో ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసుల నమోదు కావడం ఇదే తొలిసారి. శుక్రవారం 140 మంది ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా 63 మంది మహారాష్ట్ర, 29 మంది గుజరాత్, 14 మంది ఢిల్లీలో చనిపోయారు.

అయితే, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరగడం కొంత సానుకూలంశం. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కోవిడ్-19 నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 50వేల మార్క్ దాటింది. మొత్తం 51,538 మంది కోలుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లారు. మహారాష్ట్ర తర్వాతి తమిళనాడులో అత్యధికంగా 14,753 మందికి వైరస్ సోకింది.

శుక్రవారం కొత్తగా 786 కేసులు నమోదుకావడంతో ఉన్నతాధికారులతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇబ్బడి ముబ్బడిగా పాజిటివ్ కేసులు పెరిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. మహమ్మారిని కట్టడిచేయడానికి సమాలోచనలు సాగించారు. చెన్నై నగరంలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య, ఆర్ధిక, రెవెన్యూ, విపత్తు నిర్వహణ దళాలకు సూచించారు.

కరోనా ఉద్ధృతికి మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 40 శాతానికిపైగా అక్కడే నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు చాలకపోవడంతో ప్రైవేటు, చారిటబుల్‌ ఆస్పత్రుల్లోని 80 శాతం పడకలను ఆగస్టు 31 వరకు ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొంది. అక్కడ బాధితుల చికిత్సకు సంబంధించిన ఫీజులను 3 స్లాబులుగా (రూ.4 వేలు, రూ.7,500, రూ.9 వేలు) వర్గీకరించింది.

వలస కార్మికుల రాక ప్రారంభమైన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువైంది. బిహార్‌లో గడచిన 24 గంటల్లో 179 కొత్త కేసులు నమోదు కాగా.. అక్కడ బాధితుల సంఖ్య 2వేలు దాటింది. ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అసోంలలోనూ పెరుగుదల అధికంగానే నమోదైంది. లడఖ్‌, అండమాన్‌, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, దాద్రానగర్‌, త్రిపుర, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో 24 గంటల్లో కొత్త కేసులు ఒక్కటీ రాలేదు.

గుజరాత్‌లోని వాద్‌నగర్‌ సివిల్‌ ఆస్పత్రిలో వారం క్రితం పుట్టిన కవలలకు వైరస్‌ సోకింది. కరోనా పాజిటివ్‌ మహిళ వీరికి జన్మనిచ్చింది. యూపీలో కొత్తగా 232 కేసులు నమోదు కాగా.. అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 5,763కి చేరింది. భారత్‌లో జూన్‌ 21 నుంచి 28 వరకు కరోనా కేసులు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యే ముప్పు ఉందని, అక్టోబర్‌ చివరి నాటికి మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుందని జాదవ్‌పుర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నందదులాల్‌ బైరాగీ నేతృత్వంలో చేపట్టిన అధ్యయనం పేర్కొంది.Source link

0 0
Next Post

Beauty Parlours, Salons To Reopen Across Tamil Nadu From Tomorrow

Coronavirus: Tamil Nadu has the highest number of COVID-19 cases in the country Chennai: Tamil Nadu has allowed beauty parlours and salons to reopen across the state from tomorrow, days after it allowed only salons for men in rural areas to reopen as Lockdown4 kicked in. All these businesses, however, […]