Coronavirus cases in India : దేశంలో 1,000 దాటిన కరోనా కేసులు.. శరవేగంగా విస్తరిస్తోన్న మహమ్మారి – coronavirus cases in india reaches 1000, 20 died due to epidemic

admin
Read Time7 Minute, 3 Second


దేశంలో కరోనా వైరస్ మరో దశలోకి ప్రవేశించినట్టు ప్రస్తుతం నమోదవుతున్న కేసులు వెల్లడిస్తున్నాయి. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంపై ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. కాగా, అనధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,000 దాటింది. వారం రోజుల్లోనే దేశంలో కొత్తగా దాదాపు 800 కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా మరో 230 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రలో 186 కేసులు నమోదయ్యాయి. కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. 950 కేసులు నమోదయ్యాయి.


ఈ విషయంలో కేరళ కూడా మహారాష్ట్ర సమీపంలోనే ఉంది. కరోనా వైరస్ కేసుల విషయంలో ఇరు రాష్ట్రాలూ పోటీపడతున్నాయి. శనివారం మహారాష్ట్రలో 30, కేరళలో ఆరుగురుకి వైరస్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 20 మంది మృతిచెందారు.

తెలంగాణలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. శనివారం కరోనా వైరస్ తొలి మరణం చోటుచేసుకోగా, కొత్తగా మరో ఎనిమిది మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 69కి చేరింది. నాంపల్లికి చెందిన వృద్ధుడు ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అతడి నమూనాలను పరీక్షించగా కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. మృతుడు ఇటీవలే ఢిల్లీలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొనడానికి వెళ్లినట్టు గుర్తించారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురైన అతడిని చికిత్స కోసం ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో చికిత్స పొందుతూ అతడు గురువారం రాత్రి చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

ఇప్పటి కరోనా సోకినవారిలో పది మందికి చికిత్స అనంతరం పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, మరోసారి వీరిని పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. నిజామాబాద్‌లో శనివారం కరోనా కలకలం రేగింది. కరోనా అనుమానితులు ఇంట్లో విడిగా ఉండకపోవడమే రాష్ట్రంలో కేసులు పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ శనివారం మరో ఆరుగురికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గుంటూరులో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో ఇద్దరికి ఇంతకు ముందే కరోనా సోకిందని నిర్ధారణ కాగా.. మరో ఇద్దరికి తాజాగా కోవిడ్ సోకిందని తేలింది. దీంతో వీరిందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా చీరాలలో భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. నవాబుపేటకు చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి రాగా.. ఆయనతోపాటు, ఆయన భార్యలోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించిన క్వారంటైన్లో ఉంచారు. కర్నూలు జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా సోకిందని శనివారం నిర్ధారించారు. 65 ఏళ్ల వయసున్న ఈయన మార్చి 10 మక్కా నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వచ్చారు.

ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 20 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్ర నలుగురు, గుజరాత్, రాజస్థాన్‌, కర్ణాటకలో ముగ్గురు, మధ్యప్రదేశ్ ఇద్దరు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్‌లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 85 మంది బాధితులు కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 186, కేరళలో 182, ఢిల్లీలో 49, ఉత్తరప్రదేశ్‌లో 65 కర్ణాటకలో 81,లడఖ్ 13, తెలంగాణ 69, రాజస్థాన్ 54, జమ్మూ కశ్మీర్‌లో33, గుజరాత్ 55, ఆంధ్రప్రదేశ్ 19, తమిళనాడు 42, మధ్యప్రదేశ్ 39, పంజాబ్ 38, హర్యానా 35, పశ్చిమ్ బెంగాల్ 18, బీహార్ 11, అండమాన్ నికోబార్ దీవులు 9, మిగతా రాష్ట్రాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,000 కేసుల్లో 59 మందికిపైగా విదేశీయులు ఉన్నట్టు పేర్కొంది.

Source link

0 0
Next Post

Chilli farmers stare at huge losses- The New Indian Express

By Express News Service ONGOLE: Chilli farmers in Prakasam district are staring at huge financial losses with the 21-day lockdown in force to stop the spread of COVID-19 as most of the crops await harvesting. Around 50,000 farmers had cultivated chilli in and around 1.25 lakh acres in the district […]