Corona Vaccine: కరోనా వ్యాక్సిన్: హైదరాబాద్ ఔషధ సంస్థ కీలక ముందడుగు – dcig green signal to bharat biotech over corona vaccine trial

APNEWS CO
Read Time2 Minute, 20 Second


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ మరో కీలక ముందడుగు వేసింది. కరోనా కట్టడికి ఈ సంస్థ తయారు చేస్తున్న ‘కో వ్యాక్సిన్‌’ ప్రయోగాలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది. మానవులపై ఫేజ్‌-1, ఫేజ్‌-2 పరీక్షలకు అనుమతులు జారీ చేసింది. కోవిడ్‌ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం.

భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. జులై నెల నుంచి మానవులపై ప్రయోగాలు చేయనుంది. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘కో వ్యాక్సిన్‌’ తయారీ చరిత్రాత్మకం అవుతుందన్నారు.

క‌రోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ట్రయ‌ల్స్ పూర్తి చేసుకున్న కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. హైద‌రాబాద్‌లోని జివోమ్ వ్యాలీలో బ‌యోసేఫ్టీ లెవ‌ల్‌-3తో క‌లిసి కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జూలైలో మాన‌వ ప్రయోగాలు మొద‌లైనందున ఈ ఏడాది చివ‌రిక‌ల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే క‌రోనా చికిత్స కోసం గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’తో పాటు మ‌రో దేశీయ ఔష‌ధ సంస్థ హెటిరో ‘కోవిఫర్‌’ ఔష‌ధాల‌కు డీసీజీఐ అనుమ‌తి తెలిపిన విష‌యం తెలిసిందే.



Source link

0 0
Next Post

alternate for banned Chinese app: చైనా యాప్స్‌కు ప్రత్యామ్నాయం ఇవే.. - indian and us alternative apps for banned chinese apps

లడఖ్ సరిహద్దులోని గల్వాన్‌ లోయలో ఘర్షణల్లో 20 మంది జవాన్లు అమరులైన తర్వాత దేశంలో చైనాకు వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం (జూన్ 29) రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించింది. వీటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ సహా పలు యాప్‌లు ఉన్నాయి. కేంద్ర […]