chittoor man died : తెలుగు గంగలో పడి కార్మికుడు మృతి.. చిత్తూరులో విషాదం – young man died while swimming in telugu ganga canal in chittoor

admin
Read Time45Seconds


పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణించాడు. బట్టలు ఉతుక్కునేందుకు స్నేహితులతో కలిసి తెలుగు గంగ కాల్వ వద్దకు వెళ్లిన కార్మికుడు.. సరదాగి ఈతకు దిగి నీటి ఉధృతికి తట్టుకోలేక కాల్వలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన చిత్తూరులో జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని బిహార్ వాసిగా గుర్తించారు.


వరదయ్యపాళెం మండలం అవంతి లెదర్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న మూరారికుమార్(19) తెలుగు గంగ కాల్వలో పడి మరణించాడు. స్నేహితులతో కలసి బట్టలు ఉతుక్కునేందుకు వెళ్లిన మురారి.. సరదాగా ఈత కొట్టేందుకు దిగాడు. కాల్వలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయాడు. తోటి కార్మికులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:
ప్రియుడితో ఇంట్లోనే కూతురి రాసలీలలు.. తల్లి చూసిందని కళ్లలో కారంకొట్టి..

మండలంలోని నాగనందాపురం తెలుగు గంగ కాల్వలో మృతదేహం కొట్టుకువస్తున్నట్లుగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మురారి కుమర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని బిహార్‌లోని బిగుసరై జిల్లా సిమిడి గ్రామానికి చెందిన లాలన్ తాంతి కుమారుడిగా గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Read Also: వైద్యం చేయిస్తే డబ్బులైపోతాయని కన్నకూతురినే.. సంగారెడ్డిలో దారుణం





Source link

0 0
Next Post

ex lover's son kidnap : తల్లిని రప్పించేందుకు కొడుకు కిడ్నాప్.. ఆమె మాజీ ప్రియుడే.. - mother's ex lover abducts 4 year old boy in ghaziabad

ప్రియురాలిని తన ఇంటికి రప్పించేందుకు ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమె నాలుగేళ్ల కొడుకుని కిడ్నాప్ చేశాడు. ఆడుకోవడానికి వెళ్లిన కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులకు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న భార్యకి తెలిసిన వ్యక్తే కొడుకుని కిడ్నాప్ చేసినట్లు తెలియడంతో అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఘజియాబాద్‌లోని కృతి విహార్‌కి చెందిన […]