Chiranjeevi: అన్నయ్యకి సన్నిహితులైన ఆ ఇద్దరే పవన్ టార్గెట్.. కారణమేంటి?

admin
Read Time4 Minute, 48 Secondఇటీవల విశాఖలో జరిగిన సభలో.. జనసేన అధినేత మంత్రి కన్నబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. తన అన్న నాగబాబు వల్లే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని.. ఆయనా తనను విమర్శించేది అన్నట్టుగా మాట్లాడారు. ఎన్నికల సమయంలోనూ ఆయన కన్నబాబును టార్గెట్ చేసుకొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కన్నబాబును ఓడించాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గంటా శ్రీనివాస రావుపై తీవ్ర విమర్శలు చేసేవారు. అందుకే జనసేన విశాఖ సభలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నప్పటికీ.. గంటా మాత్రం కనిపించలేదు.

వాస్తవానికి కన్నబాబు, గంటా శ్రీనివాస రావు ఇద్దరూ ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిద్దరిదీ కాపు సామాజిక వర్గమే. ఇద్దరూ చిరంజీవికి ఆప్తులుగా మారారు. రాజకీయాలకు దూరమైనప్పటికీ.. గంటా, కన్నబాబు ఇద్దరూ ‘అన్నయ్య’తో టచ్‌లోనే ఉన్నారు. చిరంజీవికి కూడా వారంటే అభిమానం. ఇటీవల కన్నబాబు సోదరుడు చనిపోయినప్పుడు.. చిరంజీవి కాకినాడ వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు.

ఇక గంటా శ్రీనివాస రావు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీలో మంత్రిగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఏమనుకుంటారనే బెరుకు కూడా లేకుండా ఆయన చిరంజీవితో సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు కూడా అంతే సాన్నిహిత్యంతో ఉంటున్నారు. ఇటీవల ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ వేడుకలోనూ ఆయన మెగాస్టార్‌తో కలిసి పాల్గొన్నారు. చిరంజీవి, అల్లు అరవింద్ వైజాగ్ వెళ్తే… లేదంటే అక్కడ మెగా హీరోల సినిమా ఫంక్షన్లు జరిగితే.. అన్నీ తానై చూసుకుంటారాయన.

కానీ చిరంజీవి ఇష్టపడే కన్నబాబు, గంటా శ్రీనివాస రావు పేర్లు చెబితే చాలు పవన్ కళ్యాణ్ ఎగిరి పడతారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చిరంజీవికి సహాయకుడిగా ఉండాల్సిన.. పార్టీ ఎదుగుదలకు సహకరించాల్సిన కన్నబాబు మాయ మాటలు చెప్పి ఎమ్మెల్యే సీటు పొందాడని ఎన్నికల ప్రచార సమయంలో పవనే స్వయంగా చెప్పారు. అదీగాక.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా వీరిద్దరూ ప్రోత్సహించారనేది జనసేనాని బలంగా నమ్ముతున్నారనే వాదన కూడా ఉంది.

వీరి తప్పుడు సలహాల వల్లే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి విలీనం చేశారనే వాదన ప్రజల్లోకి వెళ్లడం కోసమే పవన్ పదే పదే వారిపై విమర్శలు గుప్పిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అదే నిజమైతే.. చిరంజీవి వారిని విమర్శించాలి. అలా కాదనుకుంటే.. చిరు స్వతహాగా సౌమ్యుడు కాబట్టి.. వారిని దూరం పెట్టాలి. కానీ ఇప్పటికీ వారితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు జనసేనాని వారిని టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు చేస్తున్నారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది.

ప్రజారాజ్యంతోనే వీరిద్దరూ ఎదిగినప్పటికీ.. ఆ పార్టీ కనుమరుగైన తర్వాత కూడా తమ ఉనికిని కోల్పోలేదు. పైగా చిరంజీవి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నామని కన్నబాబు మంత్రి అయ్యాక కూడా వ్యాఖ్యానించారు. అటు అన్నయ్యతో స్నేహంగా మెలిగే వీరి పట్ల పవన్ ఇంతగా మండిపడటానికి తను అవినీతికి దూరమని.. పార్టీపై కాపు ముద్ర వేయించుకోవడం ఇష్టం లేకేనా..? అదే నిజమైతే పవన్ వ్యూహం సత్ఫలితాన్నిస్తుందా?Source link

0 0
Next Post

Congenial climate brightens tobacco prospects

Tobacco crop is the flavour of the season in Prakasam district this winter as the extent of the crop, much in demand in the global market, goes up in the wake of bountiful rains. Thanks to unimaginative EXIM policy, farmers have switched from Bengal gram to tobacco in a big […]