Chandrababu Naidu : సోమిరెడ్డిని పరామర్శించిన చంద్రబాబు, గల్లా – tdp chief chandrababu naidu meets somireddy chandramohan reddy

admin
Read Time51Seconds


మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న సోమిరెడ్డికి.. కొద్ది రోజుల క్రితం స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నమ్మకస్తుడు, పార్టీ తరఫున నిత్యం పోరాడే సోమిరెడ్డిని చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బాబు వాకబు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


చంద్రబాబు నాయుడితోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా సోమిరెడ్డిని పరామర్శించారు. మాజీ మంత్రితో చంద్రబాబు, గల్లా, ఇతర నేతలు మాట్లాడుతున్న ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ.. సోమిరెడ్డి అధికార పార్టీపై విమర్శలు చేయడం మానలేదు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్న జగన్ వ్యాఖ్యల పట్ల స్పందించిన ఆయన… ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేద్కర్ పొరపాటు చేశారేమో అంటూ సెటైర్లు వేశారు.

‘‘మొత్తానికి రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పాలించిన వారికి లేకపోయింది. జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు. మన రాష్ట్రంలో కూడా హార్స్ లీ హిల్స్, అరకు లాంటి ప్రాంతాలున్నాయి కదా.. అక్కడి నుంచి కూడా పాలన సాగించుకోవచ్చు’’ అని ఆయన ట్వీట్ చేశారు.





Source link

0 0
Next Post

mp raghurama krishnam raju : BJP కృష్ణం రాజుతో వైసీపీ ఎంపీ కృష్ణంరాజు.. పక్కనే ప్రభాస్ - ysrcp mp raghurama krishnam raju meets bjp leader krishnam raju and prabhas

హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు బీజేపీ నేతలకు బర్త్ డే పార్టీ ఇచ్చారు. జనవరి 20న పుట్టిన రోజు జరుపుకొన్న ఆయన.. శనివారం బీజేపీ నేతలకు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. కృష్ణంరాజు ఇది వరకే సినీ ప్రముఖులకు కూడా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిరంజీవితో […]