Botsa Satyanarayana : మోదీ కేబినెట్లోకి వైసీపీ.. మంత్రి బొత్స సంకేతాలు! చిరుకు ‘రాజ్యసభ’పై ఆసక్తికర వ్యాఖ్యలు – minister botsa satyanarayana interesting comments on ysrcp joining nda

admin
Read Time44Seconds


ప్రధాని మోదీతో భేటీ అయిన జగన్.. తాజాగా అమిత్ షాను కలవడంతో ఏన్డీయేలోకి వైఎస్సార్సీపీ చేరబోతుందని ప్రచారం జరుగుతోంది. విజయసాయి రెడ్డితోపాటు బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్‌కు మంత్రి పదవులు కూడా ఖాయమయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో వైఎస్సార్సీపీ చేరే విషయమై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆచితూచి స్పందించారు. ఇప్పటికే తాము కేంద్రానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామన్నారు.


‘‘జగన్‌కు మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకడం లేదని వారం రోజుల క్రితం వార్తలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు బీజేపీ, వైఎస్సార్సీపీ దగ్గరవుతున్నాయని మీడియానే చెబుతోంద’’ని మంత్రి తెలిపారు. కేంద్రంతో తాము ఎందుకు గొడవ పడాలని మంత్రి బొత్స ప్రశ్నించారు. తాము కేంద్రంతో అంటిపెట్టుకొని తిరగడం లేదని అలాగే.. దూరమూ జరగడం లేదని బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగుతామన్న మంత్రి.. ఎవరినైనా గడ్డం పుచ్చుకొని బతిమాలడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటే.. దేన్నీ ఉపేక్షించబోమన్నారు.

కేంద్రంలో చేరే అవకాశం వస్తే పరిశీలిస్తామని మంత్రి బొత్స తెలిపారు. దాని వల్ల మేలు కలుగుతుందనుకుంటే చేరతామన్నారు. అవసరం లేదనుకుంటే మానేస్తామన్నారు. చిరంజీవికి వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని జరుగుతున్న ప్రచారంపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రయోజనాలకు ఏది పనికొచ్చినా.. పార్టీ బలోపేతానికి పనికొచ్చే నిర్ణయాలను అధినేత తీసుకుంటారన్నారు. మరో రెండు నెలలు పోతే తమ సీట్లను ఎవరికి కేటాయించేది చెబుతుమన్నారు. ముందుగా ప్రియారిటీ లిస్టును చెప్పలేమన్నారు.

ఐటీ సోదాలపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ ఏం సమాధానం చెప్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 40 చోట్ల సోదాలు చేస్తే.. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్ వద్ద రూ. 2 వేల కోట్లు బయటపడితే.. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో గమనించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులని విమర్శించిన బొత్స.. అక్రమ లావాదేవీలపై ఆయన నోరు విప్పాలని సవాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందన్నారు.

Source link

0 0
Next Post

singapore sex racket : ఎంటర్‌టైన్‌మెంట్ క్లబ్బుల పేరుతో సెక్స్ రాకెట్.. డ్యాన్సర్లతో బలవంతంగా.. - indian couple forced bangladeshi club workers into prostition, jailed in singapore

ఎంటర్‌టైన్‌మెంట్ క్లబ్బుల పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న దారుణ ఘటన వెలుగు చూసింది. విదేశీ యువతులను రప్పించి వారి వీసా, పాస్‌పోర్టులు లాగేసుకుని బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. అందుకు నిరాకరించిన ఓ డ్యాన్సర్‌ నుంచి భారీగా తిరిగి డబ్బులు డిమాండ్ చేశారు. ఎలాగో వారి బారి నుంచి తప్పించుకున్న ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు భారతీయ దంపతులను సింగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన అనంత్, ప్రియాంక […]