BJP పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు.. పవన్‌పై విజయసాయి సెటైర్లు

admin
Read Time4Seconds



జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ మరోసారి విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల విషయంపై ముందు ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని.. యూ టర్న్‌ల్లో యజమాని చంద్రబాబునే ఆయన మించిపోయాడని విజయసాయి సెటైర్లు వేశారు. ‘‘దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఢిల్లీ వెళ్లిన పవన్.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేందుకు కలిసి పని చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పే మూడు రాజధానులు చేస్తున్నట్లు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అయితే అందులో వాస్తవం లేదన్నారు. ఇప్పుడు తాను కేంద్రాన్ని కలిసే చెప్తున్నానని, మూడు రాజధానులకు కేంద్రం సమ్మతం లేదని వెల్లడించారు.

తాజాగా నడ్డాను కలిసిన అనంతరం పవన్ మరోసారి మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులను మోదీ, అమిత్ షా అనుమతితోనే చేస్తున్నామన్న వైసీపీ నేతల మాటల్లో నిజం లేదని పవన్ తెలిపారు. మూడు రాజధానులు అనేది రాష్ట్ర ప్రజల కోసం కాదు.. వైసీపీ నేతల భూ దందాతోనే అని జనసేనాని తెలిపారు. మూడు రాజధానుల అంశంలో ప్రధాని, హోం మంత్రి పాత్ర లేదని పవన్ స్పష్టం చేశారు.



Source link

0 0
Next Post

కట్నం కోసం భార్యపై కత్తులతో దాడి.. ఏఎస్సై కుమారుడి ఘాతుకం

ఏఎస్సై కుమారుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్యను నిత్యం వేధింపులకు గురిచేశాడు. కొద్దికాలం మౌనంగా భరించిన భార్య.. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆగ్రహం చెందిన భర్త.. కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిపై కత్తులతో దాడికి దిగాడు. ఈ దారుణ ఘటన జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఐరాల మండలం సంతగేటుకు చెందిన రోజాకు, పెద్దకాల్వకు చెందిన పవన్‌కుమార్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు […]