asifabad lovers suicide : పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. చివరికి.. ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం – love couple commits suicide in asifabad district

admin
Read Time45Seconds


తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల జంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. జిల్లాల్లోని కాగజ్‌నగర్ మండలంలోని అంకుశాపూర్ అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరూ కలిసి ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న యువతీయువకుల మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు. చనిపోయిన వ్యక్తులను సంతోష్, శైలజగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే సంతోష్‌కి గతంలోనే పెళ్లైనట్లు సమాచారం. పెళ్లైన వ్యక్తిని యువతి ప్రేమించి ఉంటుందని.. తమ ప్రేమ ఎవరూ అంగీకరించరని కలసి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:
ఫ్రెండ్ పెళ్లాన్ని పొగిడి పొగిడి ప్రాణాల మీదకి.. షాకింగ్ ఘటన వెలుగులోకి..





Source link

0 0
Next Post

Social Distancing The Kerala Way, Says Shashi Tharoor Amid Coronavirus Lockdown

Social Distancing Kerala Way: Congress leader Shashi Tharoor tweeted this photo of social distancing. Thiruvananthapuram: As shopkeepers around the country come to grips with the demands of “social distancing” to help keep the infectious COVID-19 virus at bay, in a country used to massive crowds and one person breathing down […]