ap budget 2019 live: AP Assembly Budget Highlights: జగన్ సర్కారు తొలి పద్దు.. లైవ్ అప్‌డేట్స్ – ap finance minister buggana rajendranath reddy assembly budget session 2019 live updates

admin
Read Time7 Minute, 32 Second


వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఏపీ బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ హయంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జగన్ నాయకత్వంలోని మంత్రివర్గం భేటీ అయి.. బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడాకి ముందు ఆర్థిక మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన అన్ని హామీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించామన్నారు.


జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు బుగ్గన తెలిపారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ.. ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీలను నెరవేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.

బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శాసన మండలిలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టాల్సింది. కానీ సోదరుడి హఠాన్మరణంతో ఆయన సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో శాసన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు..

⇨ దేశ నిర్మాణంలో తనకూ పాత్ర ఉందని ప్రతి పేద వ్యక్తీ గ్రహించాలనే జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యల స్ఫూర్తితో బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


⇨ పోలవరం, వంశధార, హంద్రీనీవ ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యం.

⇨ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యం.

⇨ బడ్జెట్ అంచనా రూ.2.27,974.99 కోట్లు

⇨ మూలధన వ్యయం: రూ. 32,293.39 కోట్లు

⇨ వడ్డీ చెల్లింపులు రూ. 8,994 కోట్లు

⇨ రాష్ట్ర రుణం 2014తో పోలిస్తే.. 2019 నాటికి విపరీతంగా పెరిగిపోయింది.

⇨ రెవెన్యూ వ్యయం రూ. 1,80,475 కోట్లు

⇨ ద్రవ్యలోటు సుమారు రూ. 35,260.58 కోట్లు

⇨ 2018-19తో పోలిస్తే బడ్జెట్ 19.32 శాతం పెరుగుదల.

⇨ ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని కోరుతున్నాం: బుగ్గన

⇨ హోదా వచ్చి ఉంటే 2020 నాటికి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలిచి ఉండేది – బుగ్గన.

⇨ 2022 నాటికి ఏపీ వృద్ధిపథంలో ఏ స్థానంలో ఉంటుందనే విషయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరు నిర్ధారిస్తుంది.

⇨ సింగపూర్‌కు విమాన సర్వీసులను నడపడానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలా..? లేదంటే తల్లులకు పోషకాహారం అందించడం ముఖ్యమో మేం నిర్ణయించుకున్నాం – బుగ్గన.

బడ్జెట్ కేటాయింపులు ఇలా..

⇨ వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.8750 కోట్లు, 15 లక్షల మంది కౌలు రైతులు సహా రైతులందరికీ అక్టోబర్ 15 నుంచే రైతు భరోసా.

⇨ వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు: రూ.100 కోట్లు

⇨ వైఎస్ఆర్ బీమా: రూ.1163 కోట్లు

⇨ ధరల స్థిరీకరణ నిధి: రూ.3 వేల కోట్లు

⇨ ఉచిత బోరు బావుల తవ్వకం: రూ.200 కోట్లు

⇨ గ్రామ సచివాలయాలు: రూ.700 కోట్లు

⇨ గ్రామ వాలంటీర్లు: రూ.720 కోట్లు

⇨ ఆర్టీసీకి సాయం : రూ.1000 కోట్లు

⇨ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ : రూ. 260 కోట్లు

⇨ పౌరసరఫరాల కార్పొరేషన్‌‌కు ఆర్థిక సాయం: రూ.384 కోట్లు

⇨ బీసీ సంక్షేమం: రూ.7271 కోట్లు

⇨ వైఎస్ఆర్ అగ్రిల్యాబ్: రూ.109.8 కోట్లు

⇨ అగ్రిగోల్డ్ బాధితులు: రూ.1150 కోట్లు

⇨ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్: రూ.100 కోట్లు

⇨ కాపు కార్పొరేషన్ : రూ.2000 కోట్లు

⇨ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు: రూ. 1180 కోట్లు

⇨ పాడి రైతులకు లీటర్‌‌కు రూ.4 బోనస్

⇨ చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.

⇨ మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ: రూ.210 కోట్లు

⇨ ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం: రూ.200 కోట్లు

⇨ కడప ఉక్కు ఫ్యాక్టరీ: రూ.250 కోట్లు

⇨ ఆత్మహత్య చేసుకున్న, ప్రమాదవశాత్తూ మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం:

⇨ బీసీలకు వైఎస్ఆర్ కళ్యాణ కానుక: రూ.300 కోట్లు

⇨ ఎస్టీలకు కల్యాణ కానుక: రూ.45 కోట్లు

⇨గిడ్డంగుల నిర్మాణం: రూ. 37.5 కోట్లు

⇨ పారిశ్రామిక మౌలిక కల్పన: రూ.250 కోట్లు

⇨ జగనన్న అమ్మ ఒడి పథకం: రూ.6455 కోట్లు, 43 లక్షల మంది తల్లులకు లబ్ధి.

⇨ ఉచిత విద్యుత్: రూ.4525 కోట్లు

⇨ విపత్తు నిర్వహణ: రూ.2002.08 కోట్లు

⇨ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం. తెలుగు బోధన తప్పనిసరి చేస్తాం.

⇨ అభివృద్ధి పథకాల అంచనా వ్యయం: రూ.92 వేల కోట్లు

⇨ మధ్యాహ్న భోజనం వంట మనిషి, సహాయకుల వేతనం రూ.3 వేలకు పెంపు.

⇨ జగన్ అన్న విద్యా దీవెన పథకం: రూ.4962 కోట్లు

Source link

0 0
Next Post

As Karnataka Chief Minister Seeks Trust Vote, Lawmakers Off To Resorts

Karnataka Crisis: HD Kumaraswamy said: “I am ready for everything”. (File) Bengaluru:  Amid questions about the Karnataka coalition’s survival, Chief Minister HD Kumaraswamy declared on Friday that he would seek a trust vote on the floor of the house and asked the Speaker to “fix a time”. In preparation for […]