ap borders closed : AP TS Border: ఏపీ సరిహద్దుల్లో నిలిచిన జనం… పోలీసులపై రాళ్లదాడి – tensions at andhra telangana border: stranded people stones on police

admin
Read Time44Seconds


ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రజలు సొంత వాహనాలు, క్యాబ్‌ల్లో ఏపీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి నిలిచిపోయారు. ఎంత సేపు వేచి చూసినప్పటికీ… ఏపీ పోలీసులు వారిని రాష్ట్రంలోకి అనుమతించలేదు. దీంతో నల్గొండ జిల్లా వాడపల్లి చెక్ పోస్టు దగ్గర పోలీసులపై ప్రయాణికులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. బదులుగా పోలీసులు లాఠీలు ఝులిపించారు.. వారిని తెలంగాణ భూభాగంలోకి తరిమి కొట్టారు.


నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకొని.. సొంతూళ్లకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నించిన తెలంగాణ యువతను టీఎస్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గంటల తరబడి కర్నూలు-మహబూబ్‌నగర్ బోర్డర్లో నిలిచిపోవాల్సి వచ్చింది.

అంతకు ముందు బుధవారం భారీ సంఖ్యలో ఏపీ వాసులు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వేలాది మంది వచ్చేస్తుండటంతో… జగ్గయ్యపేట వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాసులు ఇచ్చినా.. ఏపీ పోలీసులు మాత్రం తమను రాష్ట్రంలోకి రానీయడం లేదన్నారు. మీడియా దీన్ని హైలెట్ చేయడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్‌ల స్థాయిలో చర్చలు జరిపారు. చివరకు క్వారంటైన్లో ఉండటానికి అంగీకరించిన వారిని ఏపీలోకి అనుమతించారు. మిగతా వాళ్లు హైదరాబాద్ తిరిగి వెళ్లారు. రేపటి నుంచి ఏపీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు కుండబద్దలు కొట్టారు.

ఈ ఘటన పట్ల సీఎం తీవ్రంగా స్పందించారు. ప్రజలంతా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చేతులు జోడించి కోరారు. కరోనాను కట్టడి చేయాలంటే ఇదొక్కటే మార్గం అన్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా సంబంధ సమాచారం కోసం 192 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.





Source link

0 0
Next Post

g20 on coronavirus : G20 Virtual Summit: సరికొత్త ప్రపంచీకరణ మానవాళి శ్రేయస్సుకు దారి చూపాలి: మోదీ - g20 nations to pump in $5 trillion into global economy, pm modi calls for action plan

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న వేళ.. జీ20 దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా చర్చలు జరిపారు. కోవిడ్-19ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ్యదేశాలు తీర్మానించాయి. ఆర్థిక వ్యవస్థను కోవిడ్ అతలాకుతలం చేస్తుండటంతో.. రూ.5 లక్షల కోట్ల డాలర్లను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి పంప్ చేయాలని నిర్ణయించాయి. కరోనాపై పోరాటానికి ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి […]