Akbaruddin Owaisi: అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయలేం: కరీంనగర్ పోలీసులు – clean chit for mim mla akbaruddin owaisi on his speech in karimnagar

admin
Read Time45Seconds


రీంనగర్‌లో విద్వేష ప్రసంగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు తెలంగాణ పోలీసుల నుంచి ఊరట లభించింది. మజ్లిస్ పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన అక్బర్ ఒక వర్గాన్ని ఉద్దేశించి ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదనీ, ఆయనపై కేసు నమోదు చేయలేమని కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్ రెడ్డి శనివారం (జులై 29) వెల్లడించారు.


‘అక్బరుద్దీన్ ప్రసంగ వీడియోతో పాటు, దాని అనువాద కాపీ జత చేసి న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాం. ఆయన ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు లేవని తేలింది. అక్బర్‌పై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు.’ అని కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రజలు సంయమనం పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.

Read Also:
మరణం కంటే ఆ బాధే వేధిస్తోంది.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో చికిత్స తీసుకున్న అక్బరుద్దీన్ ఒవైసీ.. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన విషయం తెలిసిందే. కరీంనగ‌ర్‌లో గత మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘15 నిమిషాలు వదిలిపెట్టండి. హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తా’ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను అక్బర్ మళ్లీ ఉటంకించడం కలకలం రేపింది.

అక్బరుద్దీన్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరలైంది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ.. అక్బర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు అక్బర్‌కు క్లీన్‌చీట్ ఇచ్చారు. దీనిపై బీజేపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.





Source link

0 0
Next Post

YS Jagan: జగన్ సర్కారు పెట్టుబడుల వేట.. ఆగష్టు 9 రాష్ట్రానికెంతో కీలకం! - andhra pradesh govt to hold conference in vijayawada to attract investments

అమరావతి: పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ సర్కారు గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. భారత విదేశాంగశాఖ సమన్వయంతో ఆగస్టు 9న విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనుంది. వివిధ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కనీసం 30 నుంచి 40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్‌ జనరల్స్ హాజరు కానున్నారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం […]