600మందిని ట్రాప్ చేసిన టెకీ.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్

admin
Read Time3 Minute, 34 Secondఉద్యోగాల పేరుతో యువతుల్ని ట్రాప్ చేశాడో టెకీ. పేరున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం, చేతి నిండా డబ్బు, లగ్జరీ జీవితం ఉన్నా బోర్ కొట్టిందో ఏమో.. ఉద్యోగాల పేరుతో దాదాపు 600మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ క్రియేట్ చేసి ఉద్యోగాల పేరుతో నమ్మించి వాళ్ల ప్రైవేట్ ఫోటోలు‌ తీసుకొని బ్లాక్‌మెయిల్ చేశాడు. ప్రతి క్రైమ్ స్టోరీలాగే ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మియాపూర్ పోలీసులు ఆ కీచకుడి ఆట కట్టించారు.

తమిళనాడుకు చెందిన ప్రదీప్ ఓ బడా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొద్దిరోజులు క్రితం అమ్మాయి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ సృష్టించాడు. ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌లో ఆడవాళ్లను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. మహిళలు, అమ్మాయిలే టార్గెట్‌ చేసి ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలను సేకరించాడు. తర్వాత ఉద్యోగాలకు ఇంటర్వ్యూల పేరుతో వాళ్లకు మెసేజ్‌లు పంపేవాడు. తర్వాత వారితో ఫోన్‌లో మాట కలిపేవాడు.

తాను చెబుతున్న ఉద్యోగానికి మంచి ఫిజిక్ ఉండాలని.. ఫ్రంట్‌, బ్యాక్‌, చెస్ట్‌ కనపడేలా ఫోటోలు పంపాలని వారికి మాయ మాటలు చెప్పేవాడు. ప్రైవేట్ ఫోటో పంపిస్తే పరిశీలించి ఉద్యోగానికి సెలక్ట్ చేస్తానని.. జీతం భారీగా ఉంటుందని ఆశ పెట్టేవాడు. పాపం ఆ కేటుగాడి మాయ మాటలు నమ్మిన అమ్మాయిలు, మహిళలు ఫోటోలు కూడా పంపేవారు. తర్వాత ఆ ఫోటోలను అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ మొదలు పెట్టేవాడు. పరువు పోతుందన్న భయంతో.. చాలామంది అతడి వేధింపులు భరిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో మియాపూర్‌లో ఓ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి గురించి ఆరా తీశారు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ కంపెనీల్లో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయని ఓ నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి ప్రకటనలు ఇచ్చేవాడని తేలింది. అమ్మాయిల నగ్న ఫోటోలు సేకరించి ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. అతడి దగ్గర నుంచి మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.. నిందితుడి దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.Source link

0 0
Next Post

Vice-President to travel on country’s longest electrified rail tunnel today

Vice-President M. Venkaiah Naidu will travel on Venkatachalam-Obulavaripalli new railway line, the India’s longest electrified railway tunnel, at 3 p.m. on Saturday. Mr. Venkaiah Naidu, along with other public representatives and railway authorities, will travel the 6.6 km stretch from Cherlopalli to Rapuru stations, by a special train from Venkatachalam […]