35 ప్రైవేట్ ల్యాబ్‌లకు కరోనా పరీక్షలకు అనుమతి

admin
Read Time3 Minute, 18 Secondదేశంలో పాజిటివ్ కేసులు 700లను సమీపించిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 ప్రైవేట్ లేబొరేటరీలకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం (మార్చి 26) ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం గురువారం మరిన్ని నిర్ణయాలు తీసుకుంది.

కరోనా వైరస్ టెస్టుల కోసం చాలా కంపెనీలు ఐసీఎంఆర్‌ను సంప్రదిస్తున్నాయి. ఐసీఎంఆర్ ప్రయోగాత్మకంగా పరిశీలించి అనుమతులు ఇస్తోంది. తొలుత పుణే లేబొరేటరీలో మాత్రమే నిర్వహించగా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 పైగా లేబరేటరీల్లో కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మరిన్ని కంపెనీలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

Don’t Miss:

దేశంలో కరోనా నియంత్రణ కోసం ఐసీఎంఆర్.. ‘నేషనల్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ చికిత్స కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ కీలక సూచన చేసింది. కరోనా వైరస్‌తో హై రిస్క్ ఉన్నవాళ్లకు చికిత్స కోసం ‘హైడ్రాక్సీ-క్లోరో క్వినోన్’ డ్రగ్ వాడాలని సూచించింది. మలేరియా నివారణ కోసం వాడుతున్న ఈ డ్రగ్.. కరోనా చికిత్సకు కూడా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదంతోనే ఈ సూచనలను చేశారు. కరోనా అనుమానితులకు, కరోనా వైరస్ సోకిన రోగులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బంది, కరోనా బాధితులతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినవారిని హై రిస్క్ ఉన్నవాళ్లుగా ఐసీఎంఆర్ పేర్కొంది. వీరందరికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వాలని సూచించింది.

ముందు జాగ్రత్త చర్యగా ఇలా మెడిసిన్ వాడటాన్ని ‘కీమో ప్రొలాక్సిస్‌’ అంటారు. కరోనా వైరస్ నియంత్రణకు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ డ్రగ్ వాడాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ సూచించింది. ఇప్పటివరకు ఉన్న మెడిసిన్‌లో కరోనా నివారణకు ఏది ప్రభావవంతంగా పనిచేస్తుందనే అంశంపై గత కొన్ని రోజులుగా పరిశోధన కొనసాగుతోంది.

Also Read:Source link

0 0
Next Post

Authorities launch massive sanitation drive

With a 52-year-old man testing positive for COVID-19 in the city, the district administration has launched a comprehensive sanitation drive in the neighbourhood and moved the person and his close family members to the isolation ward in Vijayawada. The person, a close relative of an elected representative, is a tobacco […]