హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ధర తెలిస్తే షాక్

APNEWS CO
Read Time2 Minute, 27 Secondహైదరాబాద్‌లో మరోసారి భూతం బయటపడింది. మంగళవారం పోలీసులు భారీగా డ్రగ్స్ చెలామణిని గుర్తించారు. ఫేస్ మాస్క్‌ల పేరుతో ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ విక్రయాల దందా జోరుగా సాగుతున్నట్లుగా తేల్చారు. మంగళవారం ముగ్గురి దగ్గర నుంచి 54 గ్రాముల కొకైన్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరులో ఓ నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్‌ను హైదరాబాద్‌కు చెందిన వారు కొనుగోలు చేశారు. వీరిని పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్‌గా గుర్తించి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్ రవాణా పాసులు తీసుకొని ఈ ముఠా డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులకు ముందస్తుగా విశ్వసనీయ సమాచారం అందడంతో పక్కాగా ప్రణాళిక వేసి సికింద్రాబాద్‌లో నిందితులను పట్టుకున్నారు. వీరి వయసు 30 నుంచి 34 మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు.

ఒక్కో గ్రాము రూ.7 వేల చొప్పున వీరు 70 గ్రాముల కొకైన్‌ను బెంగళూరులోని ఓ నైజీరియన్ నుంచి కొనుగోలు చేశారని గుర్తించారు. మే 30న బెంగళూరులో ఈ లావాదేవీ ముగిశాక హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు. అప్పటికే వీరిద్దరూ కలిసి 16 గ్రాముల కొకౌన్‌ను సేవించినట్లుగా వివరించారు. మాదక ద్రవ్యాల చట్టం కింద వీరిద్దరిపై కేసు నమోదు చేశామని, వారి నుంచి , రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.Source link

0 0
Next Post

23 persons test positive in Guntur

Just a day after the administration announced several relaxations in the lockdown norms, twenty three persons tested positive for COVID-19 on Tuesday, the largest single-day spike the city has seen in weeks. Municipal Commissioner C. Anuradha said that all the new cases have been traced to Kolli Sarada wholesale market […]