హైకోర్టులో జగన్ పిటిషన్ విచారణ.. సీబీఐకి గడువు.. సీఎంకు తాత్కాలిక ఊరట!?

admin
Read Time1Secondఅక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించింది. కాగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి తమకు గడువు కావాలని సీబీఐ కోరింది. దీంతో ఫిబ్రవరి 6లోగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థాన సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫున న్యాయవాది కోరగా.. కేసు తమ వద్ద విచారణ జరుగుతుందని సీబీఐ న్యాయస్థానానికి తెలపాలని సూచించింది. హైకోర్టు తీర్పును బట్టి.. వచ్చే శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

జగన్ సీఎం అయ్యాక కేవలం ఒక్కసారి మాత్రమే సీబీఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. దీంతో ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరు కావడం లేదంటూ సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు ననుంచి ఆయన మినహాయింపు కోరగా.. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం సాధ్యపడదని అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది.Source link

0 0
Next Post

Kerala Gay Couple Moves Court To Legalise Their Marriage

The Kerala High Court has sought the views of Central and state governments on the matter. Kochi: A gay couple has moved the Kerala High Court, seeking to strike down certain provisions under the Special Marriage Act, 1954, which do not permit to get their marriage registered. Considering the writ […]