స్మగ్లర్ వీరప్పన్ కూతురు బీజేపీలోకి.. తండ్రిపై ఆసక్తికర వ్యాఖ్యలు

admin
Read Time3Secondsఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ కుమార్తె బీజేపీలో చేరారు. తమిళనాడు, హోసూరు జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ఓ ప్రైవేట్‌ కళ్యాణ మండపంలో శనివారం భారీ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆమె మిత్రులు, అనుచరులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడతానని చెప్పారు. తన తండ్రి పేద ప్రజల కోసమే జీవించారని తెలిపారు. అయితే ఆయన తప్పుడు మార్గంలో పయనించారని ఆమె వ్యాఖ్యానించారు. కుల మతాలకు అతీతంగా పేదలు, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతానని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకాలన్నీ ప్రజల శ్రేయస్సు కోసమేనని విద్యారాణి చెప్పారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తానిని ఆమె తెలిపారు. విద్యారాణి ‘లా’ విద్యనభ్యసించి అడ్వొకేట్‌గా పని చేస్తున్నారు.Source link

0 0
Next Post

Home Guard dismissed for sexually assaulting girl in Andhra Pradesh- The New Indian Express

By PTI MACHILIPATNAM: A Home Guard was on Sunday dismissed from service after he was arrested on charges of sexually assaulting a minor girl here, police said. According to an official release, Krishna District Superintendent of police M Ravindranath Babu issued orders removing B Phanindra from service, following an inquiry. […]