స్కూల్ విద్యార్థినిపై అఘాయిత్యం.. గుంటూరులో దారుణం

admin
Read Time1 Minute, 42 Secondస్కూల్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలం ములుకుదురుకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. విద్యార్థినిపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన గోపి అనే యువకుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి రేప్ చేసినట్లు తెలుస్తోంది.

బాలికపై అత్యాచారం చేసిన యువకుడు.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read:

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విజయరావును కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.Source link

0 0
Next Post

Kerala Declares Coronavirus As State Calamity After 3 Test Positive

Three people in Kerala have been tested positive for the Novel Coronavirus Thiruvananthapuram: The Kerala government has declared the lethal disease caused by the Novel Coronavirus as a “state calamity” after three people from the southern state tested positive for the virus, which originated from China’s populated Wuhan. “The announcement […]