సౌదీ రాజుపై తిరుగుబావుటా.. సోదరుడు సహా ముగ్గురు యువరాజులు అరెస్ట్!

admin
Read Time4 Minute, 18 Secondతిరుగుబాటుకు పాల్పడతున్నారనే ఆరోపణలతో రాజ కుటుంబానికి చెందిన ముగ్గుర్ని సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ రాజు సల్మాన్ సోదరుడు, బావమరిది సహ ముగ్గురు రాకుమారులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా మీడియా వెల్లడించింది. తాను ఎంత శక్తివంతుడినో మరోసారి ఈ ఘటనతో సౌదీ పాలకుడు నిరూపించుకున్నారు. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై వ్యతిరేకంగా గళం విప్పిన వీరిని అదుపులోకి తీసుకోగా.. కరోనా వైరస్ ప్రభావంతో ఉమ్రాకు వచ్చే విదేశీయుల ప్రవేశాన్ని గత గురువారం సౌదీ నిలిపివేసింది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మదీనా, మక్కా రెండూ సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు ఏడాది పొడవునా లక్షలాది సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు.

రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ రాజు సోదరుడు అహ్మద్ బిన్ అబ్దుల్లాజిజ్ అల్ సౌదీ, మేనల్లుడు మహ్మద్ బిన్ నయాఫ్‌లను శుక్రవారం ఉదయం వారి నివాసాల నుంచి బ్లాక్ క్లాడ్ రాయల్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఒకానొక సమయంలో సౌదీ సింహాసనం కోసం తీవ్రంగా పోటీపడిన ఈ ఇద్దరూ ప్రస్తుత రాజును పదవీచిత్యుడి చేయడానికి కుట్ర పన్నారని రాయల్ కోర్టు ఆరోపించింది. వారికి యావజ్జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష విధించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో తెలిపింది. న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే విధమైన కథనం ప్రచురించడం విశేషం.

అయితే, ఈ వార్తలపై సౌదీ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. తాజా నిర్బంధాలతో ప్రముఖ మతపెద్దలు, ఉద్యమకారులు, యువరాజులు, వ్యాపార వర్గాలను సౌదీ రాజు జైలుకు పంపి అధికారంపై పట్టు నిలుపుకున్నారనే అంశాన్ని విశదీకరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగీ హత్యకేసులోనూ మొహమ్మద్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే పలు కీలక ప్రభుత్వ విభాగాలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్న సౌదీ రాజు.. తన తండ్రి నుంచి అధికారం బదిలీ కావడానికి ముందు దేశంలో అంతర్గత అసమ్మతికి కారణమైనట్టు అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి.

సౌదీ రాజు మొహమ్మద్ తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఎదురుతిరిగితే వారిని జైలుకు పంపడం లేదా హత్య చేయించి అడ్డుతొలగించుకుంటున్నాడని అమెరికాకు విశ్లేషకుడు బెక్కా వాస్సేర్ వ్యాఖ్యానించారు. తాజా అరెస్టులు అందులో భాగమేనని, తనకు ఎదురితిరిగే అది రాజ కుటుంబమైనా ఉపేక్షించేదిలేదనే సందేశం పంపారని అన్నారు. సౌదీ ప్రభుత్వం మీద విమర్శనాత్మక కథనాలు రాసిన జర్నలిస్ట్ ఖషోగీ 2018 అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయంలోకి వెళ్ళిన తరువాత కనిపించకుండా పోయారు. దీంతో సౌదీ ఏజెంట్లే ఆయనను హత్యచేసినట్టు ఆరోపణలు వచ్చాయి.Source link

0 0
Next Post

Withdrawal of Rs 1300-crore TTD deposit in Yes Bank proves a boon- The New Indian Express

By Express News Service VIJAYAWADA: The decision of Tirumala Tirupati Devasthanam (TTD) to withdraw deposits to the tune of Rs 1,300 crore some months ago from Yes Bank proved to be a boon on Thursday as the Reserve Bank of India (RBI) capped the depositor withdrawal at Rs 50,000 per […]