సినీ ప్రముఖులను గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ డాన్ అరెస్టు.. భారత్‌కు..

admin
Read Time5Secondsఅండర్వరల్డ్డాన్ రవి పూజారి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ముంబయిలో, కర్ణాటకలో వివిధ నేరాలకు పాల్పడినందుకు దాదాపు 200కు పైగా కేసులు ఇతనిపై ఉన్నాయి. దశాబ్దాలుగా రవి పూజారి గురించి మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు వెతుకుతున్నారు. ఈ మోస్ట్ వాంటెడ్ అండర్వరల్డ్ డాన్ పశ్చిమ ఆఫ్రికాలో చిక్కాడు. కర్ణాటకకు చెందిన ప్రత్యేక పోలీసు బృందం, రా (ఆర్‌ఏడబ్ల్యూ) అధికారులు సోమవారం తెల్లవారుజామున అతడిని భారత్‌కు తీసుకు రానుంది.

రవి పూజారిని భారత్‌కు తీసుకొచ్చాక, దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఐఏ, సీబీఐ, రా (రీసెర్స్ అండ్ అనాలసిస్ వింగ్) విభాగాలు రవి పూజారిని విచారించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ రవి పూజారి పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో తలదాచుకుంటున్నాడు. ఇతణ్ని భారత్‌కు రప్పించేందుకు భారత పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఇతణ్ని పట్టుకొనేందుకు ఇంటర్ పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేశారు. భారత అధికారులు రవి పూజారిని తమకు అప్పగించాల్సిందిగా సెనెగల్ దేశ ప్రభుత్వాన్ని గతంలోనే కోరారు. కానీ న్యాయపరమైన లొసుగులతో రవి పూజారి తప్పించుకొన్నాడు. చివరికి అతనికి ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు దూరం కావడంతో అక్కడి ప్రభుత్వం భారత్‌కు పంపేందుకు అంగీకరించింది.

Must Read:

ఇప్పటివరకూ సెనెగల్‌లో నివసించిన రవి పూజారి ఆంటనీ ఫెర్నాండెజ్‌ అనే పేరుగల వ్యక్తిగా చెలామణి అయినట్లు సమాచారం. అంతేకాకుండా తాను పశ్చిమాఫ్రికాలోని బుర్కినో ఫాసో దేశానికి చెందిన పౌరుడినని చెప్పుకున్నాడు.

Must Read:

2000 దశకంలో నేరాలు బాగా మితిమీరిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. దోపిడీ, హత్యలకు సంబంధించి 200కు పైగా కేసులు ఇతనిపై ఉన్నాయి. అంతేకాక, బాలీవుడ్, శాండల్‌వుడ్ సినిమా స్టార్లను, ప్రముఖ పారిశ్రామిక వేత్తలను బెదిరించి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

Must Read:Source link

0 0
Next Post

Home guard sacked - The Hindu

Home guard B. Phanindra (28), who was arrested for allegedly impregnating a minor girl on Saturday, was removed from service on Sunday. According to an official release, Krishna district Superintendent of Police M. Ravindranath Babu on Sunday issued orders terminating the services of the home guard based on an internal […]