వెటర్నరీ డాక్టర్ హత్య.. ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

admin
Read Time3 Minute, 22 Secondదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌నగర్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది. స్టేషన్ ఎస్సై రవికుమార్, ఆర్జీఐఏ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా.. సకాలంలో పట్టించుకోకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో.. వారిపై వేటు వేశారు.

హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ కుటుంబ సభ్యులు పోలీసులపై ఆరోపణలు చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా? ఎవరితోనైనా వెళ్లిపోయి ఉంటుందేమో.. అని వ్యాఖ్యానించారని బాధితురాలి తల్లి వాపోయింది.

దీంతో పోలీసులు స్పందించిన తీరుపై తీవ్రంగా విమర్శలొచ్చాయి. మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళితే తమ పరిధి కాదని పోలీసులు అనడంతో.. తాము రెండు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని బాధితురాలి సంబంధీకులు వాపోయారు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిని సస్పెండ్ చేశారు.

ఇకపై ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే.. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదంటూ.. తిప్పి పంపొద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. తమ కుమార్తె భయపడుతూ ఫోన్లో మాట్లాడిందని చెప్పినా.. పోలీసులు ఇలా మాట్లాడటం, సీసీటీవీ ఫుటేజీలను చూడటం పట్ల బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగాక.. కేంద్రం జీరో ఎఫ్ఐఆర్‌కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి ఎఫ్ఐఆర్‌కు ఓ సంఖ్యను కేటాయిస్తారు. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోది కాదని భావిస్తే.. నంబర్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దీన్నే ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటారు. అనంతరం ఎఫ్ఐఆర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌కు బదిలీ చేస్తారు.Source link

0 0
Next Post

Tamil Nadu Man Arrested For Raping, Impregnating 17-Year-Old Colleague

The police arrested the accused after the girl’s parents filed a complaint. (Representational) Coimbatore: A 21-year-old man has been arrested in Tamil Nadu’s Coimbatore for raping and impregnating his minor colleague, the police said on Saturday. The man, who works at a garment company, allegedly raped his 17-year-old colleague. The […]