మీ రక్షణ కోసమే లాక్‌డౌన్.. సామాన్యులకు ఇబ్బందే కానీ తప్పదు, క్షమించండి:మోదీ

admin
Read Time3 Minute, 24 Secondఆదివారం కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని అన్నారు. ఆంక్షల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని ఆయన వేడుకున్నారు. ముఖ్యంగా రెక్కడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజలు తమని తాము కాపాడుకుంటూ తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే లాక్‌డౌన్‌ విధించామని మోదీ స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మరికొన్ని రోజుల పాటు ‘లక్ష్మణ రేఖ’ దాటకుండా ఉండాల్సిందేనని మోదీ తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులను స్ఫూర్తిగా తీసుకున్నామని, వైరస్‌ నియంత్రణకు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కృషి అమోఘమని ప్రధాని అభినందించారు. ప్రజలంతా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని కోరారు.

దేశంలో వైరస్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సాగుతోన్న పోరాటాన్ని జీవన్మరణ పోరుగా అభివర్ణించిన ప్రధాని.. కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు. క్యారంటైన్, సామాజిక దూరం పాటించని దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో, దీనిని ప్రజలంతా దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

దేశ ప్రజల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా బారినపడ్డ రామగంపా తేజ అనే బాధితుడు.. ప్రధానితో తన అనుభవాన్ని పంచుకున్నారు. వైరస్ గురించి తొలుత భయపడ్డాను, కానీ, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తనకు భరోసా ఇచ్చారని ఓ యువకుడు తెలిపాడు. కరోనా వైరస్ బారినపడ్డ ఆగ్రాకు చెందిన అశోక్ కపూర్‌ ప్రధానితో మాట్లాడుతూ.. తమ కుటుంబంలోని ఓ వ్యక్తి ఇటలీ వెళ్లొచ్చాడని, అక్కడే వైరస్ సోకిందన్నాడు. అనంతరం మిగతావారికి వైరస్ సోకిందని తెలిపాడు.Source link

0 0
Next Post

India coronavirus lockdown day 5 live updates | Deaths in Kashmir, Gujarat bring total toll to 27

India has seen 25 deaths and 979 positive cases due to COVID-19, according to the latest Health Ministry update at 10 a.m. However, data from the State governments puts the number much higher at 28 deaths and 1,032 positive cases. Of this, as many as 918 cases are active ones. […]