మాతో దోస్తీ కావాలా..? పాకిస్థాన్‌కు భారత్ అనూహ్యమైన ఆఫర్.. ఇమ్రాన్ ఏమంటావ్..?

admin
Read Time2 Minute, 27 Secondభారత్‌తో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నాం. కానీ మోదీ సర్కారే మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ తెగ గింజకుంటున్న పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మాతో స్నేహసంబంధాల కోసం అంతగా తపిస్తున్నట్లయితే.. దావుద్ ఇబ్రహీం, హఫీజ్ సయ్యీద్ లాంటి.. మీ దేశంలో ఉన్న వాంటెడ్ క్రిమినల్స్, ఉగ్రవాదులను మాకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ ప్రపోజల్‌కు ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

‘‘చాలా ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన మాట నిజమే. దీనికి ప్రధాన కారణం ఉగ్రవాద కార్ఖానా మారడమే. భారత్‌లో దాడులు చేయడం కోసం దాయాది దేశం ఉగ్రవాదులను పంపిస్తోంది. ఇది పాకిస్థాన్ కూడా కాదనలేని వాస్తవం’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఫ్రెంచ్ పత్రిక ‘లీ మోండె’‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చర్చలకు ఎవరు సుముఖంగా ఉన్నారో ఇప్పుడు చెప్పండి.. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి. అందుకు సహకరించాలని పాకిస్థాన్‌ను ఉద్దేశించి జైశంకర్ వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాలు దాదాపుగా శూన్య స్థితికి చేరుకున్నాయన్న పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యలకు స్పందనగా.. జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌ను ఐరాస ఉగ్రవాదిగా గుర్తించింది. అంతకు మూడు నెలల ముందే… జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించింది. వీరితో ముంబై నుంచి పారిపోయిన దావుద్ ఇబ్రహీం కూడా పాకిస్థాన్‌లో ఉన్నాడని భావిస్తున్నారు.Source link

0 0
Next Post

krishna district minor girl rape: కృష్ణా జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడి రేప్, ప్రసాదం కోసం వెళ్లి వస్తుండగా.. - 13 year old boy raped six year old girl in krishna district

ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప ఒకటో తరగతి చదువుతోంది. కార్తీకమాసం మొదలైన ఆరంభం నుంచి ప్రసాదం కోసం నిత్యం శివాలయానికి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రసాదానికి వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. పాప తండ్రి ఆమెను […]