మహారాష్ట్రలో కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

admin
Read Time1Secondమహారాష్ట్ర రాజకీయాలపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ఎన్సీపీ-కాంగ్రెస్ అధినాయకత్వం చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా.. కాంగ్రెస్ పార్టీ శివసేనకు బదులు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కుమారస్వామి సూచించారు. బీజేపీ సున్నిత హిందుత్వ విధానాన్ని అనుసరిస్తే.. శివసేన కఠిన హిందుత్వాన్ని అనుసరిస్తోందన్నారు. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే.. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

కఠిన హిందూత్వ విధానాన్ని అనుసరించే శివసేనతో కలిసి నడవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ ఆ పార్టీ బీజేపీతో కలిసి వెళ్లాలని.. ఆ పార్టీకి ఇదే సులభతరమని కుమారస్వామి తెలిపారు. కర్ణాటక మాజీ సీఎం చేసిన వ్యాఖ్యల పట్ల అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

2018లో జరిగిన కర్ణాటకలో ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవగా.. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి సీఎం పీఠం దక్కొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్.. ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామికి ఆఫర్ చేసింది. కానీ ఏడాది తర్వాత నిర్వహించిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి సర్కారు కుప్పకూలింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 15న ఉపఎన్నిక జరగనుంది.Source link

0 0
Next Post

Mechanical failure delays Prasanthi Express

A mechanical failure in Prasanthi Express delayed the train for more than two hours on Sunday night causing a commotion in the railway station. Railway sources said that a failure in the airconditioning in the A-1 coach of the train was noticed when the train chugged into the Guntur Railway […]