భర్తని కత్తిపీటతో నరికి చంపిన భార్య.. గుంటూరులో దారుణం

APNEWS CO
Read Time1 Minute, 21 Secondజిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తని భార్య కిరాతకంగా హత్య చేసింది. కత్తిపీటతో నరికి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన అడపా రుద్ర రెడ్డి, ఉమ దంపతులు. మద్యానికి బానిసైన రుద్ర రెడ్డి ప్రతిరోజూ మద్యం తాగొచ్చి భార్యని వేధింపులకు గురిచేసేవాడు.

గత మూడు రోజుల నుంచి భర్త వేధింపులు ఎక్కువవడంతో భరించలేకపోయిన భార్య కత్తిపీటతో దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న భర్త రుద్ర రెడ్డిని విచక్షణా రహితంగా నరికేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:Source link

0 0
Next Post

trump modi phone call: మోదీకి ట్రంప్ ఫోన్.. కీలక అంశాలపై చర్చ - pm modi, donald trump discuss g7 and india-china border tension

భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. జీ7 సదస్సుకు మోదీని ట్రంప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కొవిడ్-19పై పోరాటం, జీ7పై అమెరికా ఆలోచనలు తదితర అంశాలపై ట్రంప్‌తో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం (జూన్ 2) ట్వీట్ చేశారు. భారత్-చైనా సరిహద్దులో ఘర్షణ, అమెరికాలో నిరసనల పైనా ఇరువురు దేశాధినేతలు సంభాషినట్లు తెలుస్తోంది. […]