'బాబు గారి హయాంలో.. మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్'

admin
Read Time6Secondsబడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు ఆర్థిక మంత్రి . రైతులు, పింఛన్‌దారులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేసేలా నిధుల కేటాయింపు జరిగిందన్నారు. బుధవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి.. సమాధానం ఇచ్చారు. టీడీపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే ఈ బడ్జెట్‌లో పన్నులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు బుగ్గన. గత ప్రభుత్వ పథకాల్లో జరిపిన కేటాయింపులకు, ఖర్చుకు సంబంధం లేదని విమర్శించారు. వారి హయాంలో 5 శాతం వడ్డీలేని రుణాలు ఇచ్చి.. ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వడ్డీలేని రుణాలకు వచ్చే బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు ఉంటాయన్నారు.

తొలి బడ్జెట్‌లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలకు కేటాయింపులు చేశామన్నారు బుగ్గన. రాజధాని నిర్మాణం కోసం తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించామని.. గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో సరైన వసతులు కూడా లేవన్నారు మంత్రి. చిన్నపాటి వర్షాలకే భవనాల్లోకి నీళ్లు వస్తున్నాయన్నారు. అమ్మఒడి పథకానికిరూ. 6556 కోట్లు కేటాయించామని.. దీనిని ప్రతిపక్షం విమర్శించడం దారుణమన్నారు. వ్యవసాయం, పారిశ్రామికరంగం, సాగునీరు, గ్రామీణ అభివృద్ధితో పాటే కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో పింఛన్ల కోసం ఎక్కువ నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. పింఛన్లకు రూ.15,868 కోట్లు కేటాయించామని.. నెలకు రూ.40వేలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.11వేల కోట్లు కేటాయించి రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ కింద రూ.3వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తాము మాత్రం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించామన్నారు.

టీడీపీ హయాంలో పథకాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు . నీరు-చెట్టు, వనం-మనం, దోమలపై దండయాత్ర, హ్యాపీ సండే ఇలా అప్పుడు చేసిన కేటాయింపుల్ని బుగ్గన వివరించారు. ఓవైపు టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతూనే.. హ్యాపీ సండే ఎక్కడుందని ఎద్దేవా చేశారు. దోమలపై దండయాత్ర అన్నారు.. ఏం చేశారో వాళ్లకే తెలియాలన్నారు. చంద్రబాబుకు ప్రచార ఆర్భాటం ఎక్కువ.. ప్రజలు కూడా ‘మ్యాటర్ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌’అంటుటారని సెటైర్లు పేల్చారు.Source link

0 0
Next Post

Before Trust Vote, Congress Leader DK Shivakumar's Sincere Personal Request To Rebels

DK Shivakumar has been making desperate attempts to win them back, but his efforts have come a cropper Bengaluru:  As the Karnataka coalition faces a floor test it may not breeze through because of multiple resignations over the past few days, DK Shivakumar, the Congress’s chief troubleshooter, said he was […]