ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై గ్యాంగ్‌రేప్.. పార్క్‌లోనే దారుణం

APNEWS CO
Read Time2 Minute, 12 Secondఏకాంతంగా మాట్లాడుకునేందుకు పార్క్‌కి వెళ్లిన ఆ ప్రేమజంటకు దారుణ అనుభవం ఎదురైంది. యువతిపై కన్నేసిన కామాంధులు ప్రియుడిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగ్యాంగ్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తరుచూ సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. ఈ నెల ఐదో తేదీన ఏకాంతంగా ఉండేందుకు ఓ పార్క్‌కు వెళ్లారు.

Also Read:

చెట్ల పొదల్లోకి వెళ్లి ముచ్చట్లు చెప్పకుంటూ చీకటి పడిన విషయాన్నే గమనించలేదు. అదే సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు యువకుడు వారిద్దరిని గమనించారు. ప్రేమజంటను నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. ప్రియుడిని చెట్టుకు కట్టేసి అతడి కళ్లెదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు.

Also Read:

కాసేపటి తర్వాత తేరుకున్న యువతి ప్రియుడి కట్లు విప్పింది. ఇద్దరూ కలిసి నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులందరినీ గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read:Source link

0 0
Next Post

Vande Bharat Mission: Over 100 Indians Stranded In US Land In Hyderabad

As many as 118 Indians stranded in the USA landed at GMR-led Rajiv Gandhi International Airport in Hyderabad on Monday as part of the biggest ever off-shore evacuation drive of Indian Citizens under… Source link