పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారుకు సుప్రీం కీలక ఆదేశాలు

admin
Read Time1Secondస్టేటస్‌ రిపోర్టు, నిర్మాణ ఫొటోలను తమకు అందజేయాలని జగన్ సర్కారును ఆదేశించింది. ఒడిశా, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందని ఒడిశా తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ముంపు విషయంలో కనీస అధ్యయనం కూడా చేయలేదని ఒడిశా ఆరోపించింది.

మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు లేవని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. మణుగూరు ప్లాంట్, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవని, యథాతథంగా నిర్మాణం కొనసాగుతోందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయస్థానం.. కేసును రెండు వారాలపాటు వాయిదా వేసింది.Source link

0 0
Next Post

telangana girl rape : కోదాడలో ఆరేళ్ల చిన్నారిపై ఆటో డ్రైవర్ అత్యాచారం - telangana auto driver rapes six year girl

మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఆడపిల్ల అయితే చాలు.. వరసలు, వయసు మర్చిపోయి మరీ దుశ్చర్యలకు తెగబడుతున్నారు. తాజాగా, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. Also Read: అత్తతో శృంగారం.. ఆ ఫొటోలతో బెదిరించి, బాలికను గర్భవతిని చేసి.. బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు […]