పెళ్లి కోసం.. కాబోయే అత్తారింటికి 70 కి.మీ. నడిచి వెళ్లిన యువతి!

APNEWS CO
Read Time2 Minute, 13 Secondగత ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఓ యువతి ప్రియుడి కోసం మచిలీపట్నం వరకు నడిచి వెళ్లి పెళ్లి చేసుకున్న ఘటన గుర్తుందా? లాక్‌డౌన్ టైంలో ఆ యువతి ఒంటరిగా 70 కి.మీ. నడిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరప్రదేశ్‌లోనూ దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కాన్పూర్‌కు చెందిన గోల్డి అనే యువతికి కన్నౌజ్‌కు చెందిన వీరేంద్ర అనే యువకుడితో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. మే 4న వీరి పెళ్లి జరగాల్సింది. కానీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

దీంతో తమ పెళ్లి ఇప్పట్లో అయ్యేలా లేదని భావించిన గోల్డీ.. 80 కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్లి తన కాబోయే అత్తవారింటికి చేరుకుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉదయాన్నే నడక ప్రారంభించిన ఆమె… సాయంత్రానికి తన కాబోయే భర్తను కలుసుకుంది. ఆమెను చూడగానే అత్తింటి వారు అవాక్కయ్యారు.

ఏమ్మా ఇలా వచ్చేశావ్ అని అడగ్గా.. మీ అబ్బాయితో వెంటనే నా పెళ్లి చేయించండి అని అడిగింది. ఇదేంట్రా బాబు అనుకోని వాళ్లు గోల్డీ వాళ్ల నాన్నకు ఫోన్ చేశారు. అప్పటికే ఆయన కూతురి కోసం వెతుకుతున్నారు. ఇలా బాగోదు.. మేమే మే ఇంటికి వచ్చి పెళ్లి జరిపించి.. ఇంటికి తీసుకొస్తామని నచ్చజెప్పడానికి అత్తారింటి వారు ప్రయత్నించారు. కానీ గోల్డీ ససేమీరా అనే సరికి చేసేదేం లేక అప్పటికప్పుడే పురోహితుడిని పిలించి.. ఏర్పాట్లు చేసి ఇద్దరికీ పెళ్లి చేశారు.Source link

0 0
Next Post

vijayawada boy suicide: చదువుకోమని మందలించారని బాలుడి ఆత్మహత్మ.. మచిలీపట్నంలో విషాదం - 14 year old boy commits suicide in machilipatnam

అమ్మ కొట్టిందని.. తండ్రి తిట్టాడని చిన్నచిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే ఉంటున్న కుమారుడిని పుస్తకం తీయమని తల్లిదండ్రులు మందలించారని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. పద్నాలుగేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మచిలీపట్నంలోని బ్రహ్మపురంలో జరిగింది. […]