పెళ్లి కాకుండానే కూతురికి గర్భం.. ఆరా తీస్తే దారుణం వెలుగులోకి..

APNEWS CO
Read Time2 Minute, 21 Secondకడుపునొప్పితో బాధపడుతోందని పద్నాలుగేళ్ల కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. పెళ్లి కాకుండానే కూతురు గర్భం దాల్చిందని చెప్పడంతో వారి గుండె బద్దలైంది. అమ్మాయిని నెమ్మదిగా ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా పక్కింటి కుర్రాడు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన యూపీలోని కాన్పూర్‌లొ చోటుచేసుకుంది.

కాన్పూర్‌లోని కాకాదేవో ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(14) తల్లిదండ్రులతో కలసి నివాసముంటోంది. బాలికపై కన్నేసిన పక్కింటి కుర్రాడు(16) దారుణానికి ఒడిగట్టాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసేవాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంటికి వెళ్లి కామకోరికలు తీర్చుకునేవాడు. నాలుగు నెలలుగా బాలికకు నరకం చూపించాడు. తీరా బాలిక కడుపునొప్పి అని బాధపడుతుండడంతో దారుణం వెలుగుచూసింది.

Also Read:

కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. పెళ్లి కాకుండానే కూతురు గర్భం దాల్చిందని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండెబద్దలైంది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరని అమ్మాయిని నెమ్మదిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also:Source link

0 0
Next Post

Watch | 1088 ambulances and mobile medical units launched in Andhra Pradesh

A huge fleet of ‘108 ambulances’ and ‘104 mobile medical units’ were launched in Andhra Pradesh. It was flagged-off by Chief Minister Y.S. Jagan Mohan Source link