పెళ్లికొడుకు తలపై గన్, చేతిలో తాళి.. ఎదురుగా అమ్మాయి.. చివరికి అదిరిపోయే ట్విస్ట్

admin
Read Time3 Minute, 17 Secondదేశమంతా లాక్ డౌన్ అమలవతుంటే వాళ్లు మాత్రం తుపాకీలు పట్టుకుని కిడ్నాప్‌కి బయల్దేరారు. రివర్స్‌లో యువకుడిని చేసి తెచ్చి అమ్మాయితో బలవంతంగా జరిపించే ప్రయత్నం చేశారు. తలకి తుపాకీ గురిపెట్టి తాళి కట్టమనడంతో ఏంచేయాలో అర్థంకాని యువకుడు.. అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్ మీడియా పుణ్యమాని ఆ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం చూశాం కానీ.. ఇలా అబ్బాయిని బెదిరించి పెళ్లి చేయాలనుకోవడమేంటని వీక్షకులు విస్తుపోయారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు యత్నించిన ఘటన లోని వైశాలి జిల్లాలో జరిగింది. జందహా మార్కెట్‌ ప్రాంతానికి చెందిన యువకుడు అమిత్(24) కిడ్నాప్‌కు గురయ్యాడు. అతని తండ్రి ముసఫిర్ రాయ్‌తో కలసి ఆస్పత్రికి వెళ్తుండగా తుపాకులతో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని అపహరించి సమీపంలోని సమస్తిపూర్ జిల్లా బరుణ రసల్‌పూర్‌కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తనకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారన్న విషయం యువకుడికి బోధపడింది.

Also Read:

తలపై తుపాకీ గురిపెట్టి.. చేతిలో తాళి పెట్టి.. ఎదురుగా అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమని చెప్పడంతో కంగుతిన్నాడు. అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించారు. అయితే కిడ్నాప్ నుంచి తప్పించుకున్న అమిత్ తండ్రి రాయ్ పోలీసులను ఆశ్రయించడంతో రసల్‌పూర్ చేరుకుని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అమిత్‌ని రక్షించి అతని తండ్రితో పంపించేశారు. వివాహం చేసుకున్న అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకి అప్పగించడంతో కిడ్నాప్ కథ అడ్డం తిరిగింది.

Read Also:

ఆ తతంగమంతా సెల్‌ఫోన్ కెమెరాల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
అమిత్ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు.. కిడ్నాప్, బెదిరింపులు తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. కారులో అమిత్‌, అతని తండ్రిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నావల్ రాయ్, వినోద్ రాయ్‌ సహా ఐదుగురిపై కేసు నమోదైంది.

Also Read:Source link

0 0
Next Post

Heritage Foods donates ₹1 crore to CM’s Relief Fund of six States to fight COVID-19

Heritage Foods Limited has decided to contribute ₹ 1crore to the nation towards the fight against COVID-19 pandemic in its major operating areas across the country. Of the total, ₹ 30 lakh each would be donated to the Chief Minister’s Relief Fund of Andhra Pradesh and Telangana respectively. Similarly ₹ […]