పాక్ ప్రధానితో ట్రంప్ భేటీ.. ‘కశ్మీర్’పై మరోసారి సంచలన వ్యాఖ్యలు

admin
Read Time3 Minute, 47 Secondఅమెరికా అధ్యక్షుడు వచ్చే నెల భారత పర్యటనకు రానుండగా, కశ్మీర్ అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని, కశ్మీర్ అంశం సహా ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాల గురించి కూడా చర్చిస్తామని ట్రంప్ మంగళవారం వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఒకవేళ తమ వంతు సహాకారం కూడా అందజేస్తామని, ఇరు దేశాల మధ్య జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరైన ట్రంప్.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘కొన్ని సరిహద్దుల్లో కలిసి పనిచేయడం’ అన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పష్టత లేదు.. కానీ, ఇటీవల పాకిస్థాన్‌లో పర్యటించిన అమెరికా అధికారులు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, భారత్‌కు వ్యతిరేకంగా దాడులకు పాల్పడుతోన్న ఉగ్రవాద సంస్థలపై పాక్ తీసుకుంటున్న చర్యలకు సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది.

సరిహద్దుల్లో భారత్ దుందుడుకు వైఖరిని అవలంబిస్తోందని ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్.. ఈ విషయంలో తమకు సహకరించాలని అమెరికాను కోరుతోంది. అలాగే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోడానికి అగ్రరాజ్యాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ విషయంలో అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మాత్రం పాక్‌ను నమ్మడంలేదు.

విషయంలో భారత్, పాకిస్థాన్‌లకు తమ వంతు సాయం చేస్తామన్న ట్రంప్.. ఆ సాయం ఏ రూపంలో ఉంటుందో మాత్రం ట్రంప్ చెప్పలేదు. కశ్మీర్ అంశంపై తాను ఇమ్రాన్‌ ఖాన్‌తో చర్చించనట్టు ట్రంప్ పేర్కొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయిన ట్రంప్ పలు అంశాలపై చర్చించారు. అమెరికా-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

కశ్మీర్ వివాదం గురించి ప్రస్తావించిన ట్రంప్.. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారం అని, మూడో దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. అమెరికా సహా ఏ దేశం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పలు మార్లు స్పష్టం చేసింది. అయినా.. ట్రంప్.. పెద్దన్న పాత్ర పోషించేందుకు రెడీ అనడం చర్చకు దారితీసింది.Source link

0 0
Next Post

Lukewarm response to bandh call- The New Indian Express

By Express News Service VIJAYAWADA:  The bandh call given by Amaravati Parirakshna Joint Action Committee (JAC), which is opposing the AP Decentralisation of Governance and Inclusive Development of all Regions Bill-2020, evoked a lukewarm response in the capital villages on Tuesday.  While normal life was thrown out of gear in […]