పాక్‌కు భారీ షాక్.. గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చిన ఎఫ్ఏటీఎఫ్!

admin
Read Time5 Minute, 28 Secondఅంతర్జాతీయ సమాజం ఎంతగా చెబుతున్నా ఉగ్రవాదం విషయంలో తన పంథాను మార్చుకోని పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోకపోగా, వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నట్టు పక్కా ఆధారాలు లభించడంతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్ ఏకంగా బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్‌‌ వైఖరిలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలోని గత రెండు రోజులుగా జరగుతోన్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి నివేదికను ఎఫ్ఏటీఎఫ్‌కి పాక్‌ ఇటీవలే సమర్పించింది. అయితే, పాక్‌ తీసుకున్న 40 రకాల చర్యల్లో దాదాపు 32 తమ నిబంధనలకు అనుగుణంగా లేవని ఎఫ్‌ఏటీఎఫ్ ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది. అలాగే తరలింపు, అక్రమ నగదు చలామణి లాంటి కీలకమైన 11 అంశాల్లో తన లక్ష్యాలను చేరుకోలేకపోయిందని పేర్కొంది. మొత్తం 41 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పాక్‌ చర్యలను ఏ ఒక్కరూ సమర్థించలేదని సమాచారం. ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకునే అంశంలో పాక్‌ చేపట్టిన చర్యలు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు అనుగుణంగా లేవని సభ్యులు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.

కాగా, అక్టోబరులో జరిగే సమావేశం నాటికైనా పాకిస్థాన్ తన లక్ష్యాలను చేరుకుంటే బ్లాక్ లిస్ట్ ముప్పు నుంచి బయటపడుతుంది. లేకపోతే మరింత ఇబ్బందులు పాక్ ఎదుర్కొవాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ గత ఏడాది జూన్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టే ఎఫ్ఏటీఎఫ్.. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు అందుతోన్న నిధులపై డేగ కన్నుతో కాపాలకాస్తుంది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ గతేడాది ఫిబ్రవరిలోనే పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది. దీనిని నుంచి తప్పించుకోడానికి 26 అంశాలతో కూడిన కార్యాచరణను రూపొందించింది.

నగదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, స్వచ్ఛంద సంస్థల ముసుగులో నిధులు దుర్వినియోగం ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని, వచ్చే ఏడాది జనవరి నాటికి తమ మొదటి లక్ష్యాన్ని చేరుకుంటామని, మొత్తం 26 అంశాల కార్యాచరణ 2019 సెప్టెంబరు నాటికి పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది. అయితే, వీటిని చేరుకోవడంలో పాక్ విఫలమైంది. ఆర్థిక శాఖ వర్గాలు తెలిపినట్టు ఆ పత్రిక వెల్లడించింది. 2017 అక్టోబర్‌లో తొలిసారిగా ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష జరిపింది. గత ఫిబ్రవరిలో రెండోసారి జరిగిన సమీక్షలో జైషే మహ్మద్‌ సహా పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న పలు ఉగ్రవాద ముఠాలకు సంబంధించి కార్యాచరణను అమలు చేయాలని స్పష్టం చేసింది. అయినా పాకిస్థాన్‌ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో గత జూన్‌లో మరోసారి పాక్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉన్న అంశాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ.. వ్యూహాత్మక లోపాలను అధిగమించడానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ కార్యాచరణ ప్రణాళికను సరిగా అమలు చేయాలని పేర్కొంది. అలాగే అక్రమ నగదు చలామణి, ఉగ్రవాద నిధుల సరఫరా అరికట్టే అంశంలో పాక్‌ తీసుకుంటున్న చర్యలు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక మూలాలతో పొంచి ఉన్న ముప్పుపై సరైన అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అయినా పాక్‌ కంటితుడుపు చర్యలకే పరిమితమవడం గమనార్హం.Source link

0 0
Next Post

HD Deve Gowda Targets Siddaramaiah For Congress-JDS Coalition Collapse

After the Congress-JDS coalition lost the vote, Mr Deve Gowda said its future rested with the Congress Bengaluru:  Rifts within the Congress-Janata Dal Secular alliance in Karnataka, already on edge after losing a controversial trust vote last month that handed the state to the BJP, are widening after veteran JDS […]