పసిగుడ్డును మురుగు కాలువలో పడేసిన కర్కశ తల్లి..

admin
Read Time2 Minute, 25 Secondపెళ్లి కాకుండే కావడమే కాకుండా.. పుట్టిన మృత శిశువును మురుగు కాలువలో పడేసింది ఓ కర్కశపు యువతి! జిల్లా మండలం కాటకోటేశ్వరంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఈ నేపథ్యంలోగురువారం అర్ధరాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు గర్భంలోనే మృతిచెందడంతో మురుగు కాలువలో పడవేసినట్లు తెలిసింది.

Also Read:

పసిగట్టిన అంగన్‌వాడీ సిబ్బందిస్థానికులు శుక్రవారం ఉదయం మురుగు కాలువలో ఉన్న శిశువును చూసి పంచాయతీ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత స్థానిక ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటా సర్వే చేసి అనారోగ్యంతో ఉన్న సదరు యువతిని గుర్తించి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో తాడిమళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి సుధీర్‌కుమార్‌ పర్యవేక్షణలో నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించి యువతికి వైద్య పరీక్షలు చేశారు. దీనిపై సమిశ్రగూడెం ఎస్సై టీవీ సురేష్‌ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Also Read:

పనులకు వెళ్లి పరిచయం పెంచుకుని..ఈ ఏడాది జనవరిలో తండ్రితో కలిసి యువతి జంగారెడ్డిగూడెం మండలంలో పొగాకు నారుమడుల పనికి వెళ్లింది. అయితే వారికి బంధువైన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ శారీరక సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే గర్భం వచ్చినట్లు తనకు తెలియదని ఆ యువతి చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read:Source link

0 0
Next Post

Civic body elections by February, says Botcha

Election for all corporations and municipalities in the State will be held by February, according to Minister for Municipal Administration and Urban Development Botcha Satyanaryana. In a chat with the media here on Satudray, Mr. Satyanarayana said that efforts were on to conduct elections for all civic bodies. He also […]