పగోడికీ కన్నీళ్లు తెప్పించే విషాదం.. బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్, గర్భం.. చివరికి కరోనా.?

APNEWS CO
Read Time2 Minute, 42 Secondకామాంధులు బరితెగించారు. దర్గాకి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి బంధించి చేశారు. రెండు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేస్తూ నరకం చూపించారు. కామపిశాచుల దాష్టీకానికి బలైన బాలిక గర్భం దాల్చింది. ఎలాగో వారి బారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేశారు. అయితే నిందితుల్లో ఒకరికి రావడంతో అంతా షాక్‌కి గురయ్యారు.

న్యూఢిల్లీకి చెందిన మైనర్ బాలిక ప్రార్థనలు చేసేందుకు లాక్‌డౌన్‌కి ముందు దర్గాకు వచ్చింది. రైల్వేస్టేషన్‌లో ఆమెను గమనించిన దర్గా ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అస్గర్ అలీ బాలిక ఆశ్రయం కల్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. తన స్నేహితులు బిహార్‌కి చెందిన మహ్మద్ రఫీక్, హబీబుల్లా రూమ్‌కి తీసుకెళ్లాడు. గదిలో ఆమెను బంధించి ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read:

రెండు నెలలపాటు నరకం చూపించారు. పశువుల్లా మీద పడి తమ కామ వాంఛలు తీర్చుకున్నారు. ఓ స్వచ్ఛంద కార్యకర్త ద్వారా ఆ నరకం నుంచి బయటపడిన బాధితురాలు దర్గా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే అక్కడి వైద్యులు చెప్పిన మాటలకు ఆమె హతాశురాలైంది. రెండు నెలల దాష్టీకానికి గురైన బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దాని నుంచి తేరుకోక ముందే మరో షాకింగ్ విషయం బటయపడింది. తనపై సామూహిక అత్యాచారినికి పాల్పడిన నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో ఇద్దరు నిందితుల ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో బాలికకు కరోనా పరీక్షలు చేయించారు. అందరినీ క్వారంటైన్‌కి తరలించారు.

Read Also:Source link

0 0
Next Post

Jagan’s rule riddled with failures, alleges opposition

Opposition parties took aim at the ruling YSR Congress Party ahead of its completion of one year in office, by holding agitations against a recent hike in electricity tariff. Srikakulam MP Kinjarapu Rammohan Naidu, former Srikakulam MLA Gunda Lakshmi Devi and TDP Srikakulam district president G. Sirisha headed a protest, […]