‘నేను చనిపోతున్నా శ్రీదేవి..’ భార్యతో పేద రైతు చివరిమాట.. కర్నూలులో విషాదం

admin
Read Time4Secondsవ్యవసాయం కలసిరాలేదు. బోర్లు వేస్తే చుక్కనీళ్లైతే రాలేదు కానీ లక్షల అప్పులు మాత్రం పెరిగిపోయాయి. అందులో అదృష్టం కలసి రావడం లేదని మగ్గం నేత పనికి కూడా వెళ్లాడు. అయితే అక్కడా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అప్పులు.. వాటి వడ్డీలు మాత్రం కుప్పలుగా పెరిగిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురై పేదరైతు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భార్యకు పిడుగులాంటి వార్త చెప్పి ప్రాణాలొదిలేశాడు. ఈ విషాద సంఘటన జిల్లాలో జరిగింది.

కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రాజ్‌కుమార్‌(35), శ్రీదేవి భార్యాభర్తలు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. తనకున్న ఐదెకరాల్లో సాగు చేయడంతో పాటు మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. నీళ్లు పడతాయేమోనన్న ఆశతో గతేడాది పొలంలో బోర్లు వేయించాడు. నీళ్లు పడకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అయినా వరుణుడి మీద భారం వేసి ధైర్యం చేసి పత్తి సాగు చేశాడు. అందులోనూ నష్టాలే రావడంతో కుంగిపోయాడు.

Also Read:

అప్పటికే అప్పులు రూ.7 లక్షలకు పెరిగిపోయాయి. తీర్చే దారి కనిపించకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఓ రోజు మార్నింగ్ వాక్‌కని చెప్పి తిరిగిరాలేదు. భార్యకు ఫోన్ చేసి పిడుగులాంటి వార్త చెప్పాడు. ‘అప్పులు తీరే దారి కనిపించడం లేదు. నేను వెల్దుర్తిలో రైలు పట్టాలపై ఉన్నా… చనిపోతున్నా శ్రీదేవి’ అని చెప్పడంతో భార్య హతాశురాలైంది.

Read Also:

ఆమె వెంటనే తేరుకుని వెల్దుర్తిలోని తమ బంధువులు.. పోలీసులకు సమాచారం అందించడంతో రాజ్‌కుమార్ కోసం వెతకడం ప్రారంభించారు. వెల్దుర్తి రైల్వే ట్రాక్‌పై రాజ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించిన రైల్వేపోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పుల భాధతో యువరైతు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్రంగా కలచివేసింది.Source link

0 0
Next Post

Shady transactions detected, says I-T

In its search and seizure operations in Hyderabad, Vijayawada, Pune, Kadapa Visakhapatnam and Delhi on February 6, the Income-Tax Department (ITD) detected the siphoning of more than ₹2,000 crore through transactions layered across multiple entities. The turnovers of the last ones in that chain were found to be less than […]