‘నీ భార్యతో 8ఏళ్లు ఎంజాయ్ చేశా.. ఫోటోలు బయటపెడతా’మాజీ ప్రియురాలి భర్తకు బెదిరింపులు

admin
Read Time2 Minute, 23 Second‘నీ భార్య నాతో ఎనిమిదేళ్ల పాటు ప్రేమాయణం నడిపింది. చాలాసార్లు శారీకరంగానూ ఎంజాయ్ చేశాం. ఆ సమయంలో న్యూడ్ ఫోటోలు తీసుకున్నాం. నేను చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్‌మీడియా పోస్ట్ చేస్తా’ అంటూ ఓ వ్యక్తి మాజీ ప్రియురాలి భర్తను వేధిస్తున్నాడు. అరసికెరె తాలూక అగ్గుందకు చెందిన వినయ్‌ (35) అనే వ్యక్తి గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ప్రేమించాడు. సుమారు 8ఏళ్లపాటు సాగిన వీరి ప్రేమాయణంలో ఇద్దరూ ఎన్నో హద్దులు దాటేశారు.

Also Read:

చివరికి పెళ్లి సమయానికి వచ్చేసరికి పెద్దలు అడ్డుపడ్డారు. పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ససేమిరా అనడంతో ఎదిరించి వెళ్లిపోయేందుకు ధైర్యం చాలక ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లిచేసుకున్నారు. ఇటీవల మాజీ ప్రియురాలు అతడి కంట పడటంతో వినయ్‌లోని దుర్మార్గుడు బయటకు వచ్చాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఫోటోలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలకున్నాడు.

Also Read:

ఆమె భర్త ఫోన్ నంబర్ సేకరించి ఫోన్ చేసి తన ప్రేమాయణం గురించి చెప్పాడు. ‘నీ భార్యతో 8ఏళ్లు ప్రేమాయణం నడిపి ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో ఆమెను నగ్నంగా ఫోటోలు తీశా. నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని బయటపెడతా’ అంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితుడు నేరుగా హాసన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:Source link

0 0
Next Post

hyderabad mmts accident : MMTS రైలు ఢీకొని కాబోయే దంపతుల మృతి.. హైదరాబాద్‌లో తీవ్ర విషాదం - hyderaba man and his fiance hit by mmts train while going to wedding shopping, two died

హైదరాబాద్‌‌ నగరంలో విషాదం నెలకొంది. మంగళవారం చందానగర్ సమీపంలోని పాపిరెడ్డి నగర్‌లో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువతీ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. మృతులను పాపిరెడ్డి నగర్‌కే చెందిన మనోహర్, సోనీగా గుర్తించారు. వీరికి ఇటీవలే పెద్దలు వివాహం నిశ్చయించి ఘనంగా ఎంగేజ్‌మెంట్ నిర్వహించారు. ఫిబ్రవరిలో పెళ్లికి ముహూర్తం కుదరడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: ‘నీ భార్యతో 8ఏళ్లు ఎంజాయ్ చేశా.. ఫోటోలు బయటపెడతా’మాజీ ప్రియురాలి భర్తకు బెదిరింపులు ఈ […]