దయచేసి వినండి.. మీరు ఎక్కాల్సిన రైలు 2 గంటలు లేటు!

APNEWS CO
Read Time3 Minute, 47 Secondలాక్‌డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన రైళ్లు 55 రోజుల తర్వాత మళ్లీ పట్టాలెక్కడానికి సిద్దమయ్యాయి. మంగ‌ళ‌వారం (మే 12) నుంచి 15 రూట్లలో ప్రత్యేక రైళ్లను న‌డపనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రైలు ప్రయాణికులకు ఇంతకుముందులా స్టేషన్లలో టిక్కెట్లు ఇచ్చే సదుపాయం లేదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకొని రిజ‌ర్వేష‌న్ క‌న్ఫామ్ అయిన వారికే రైళ్లలో ప్రయాణించే అవకాశం వస్తుందని ప్రకటించింది.

రిజ‌ర్వేష‌న్ చేసుకోకుండా రైలు ఎక్కడం కుద‌ర‌దని రైల్వే శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆన్‌లైన్ బుకింగ్స్‌కు తాకిడి పెరిగింది. సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి ఐఆర్సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో టికెట్లు బుకింగ్ చేసుకోవ‌చ్చని రైల్వే శాఖ తెలిపింది. దీంతో 4 గంట‌ల‌ నుంచే పలువురు ఆ వెబ్‌సైట్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా.. ఓపెన్ కాలేదు. ఆరు గంట‌ల నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుందంటూ స్క్రీన్‌పై ఓ సందేశం కనిపించింది. దీంతో ప్రయాణికులు కాస్త అసహనానికి గురయ్యారు. స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ అంశంపై రైల్వే శాఖ స్పందించింది. స్పెషల్ రైళ్ల డేటాను ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌కు అందించే క్రమంలో కాస్త జాప్యం జరిగినట్లు వివరణ ఇచ్చింది. అందువల్ల టికెట్ బుకింగ్ ఆలస్యంగా మొదలవుతుందని ట్వీట్ చేసింది.

న్యూఢిల్లీ నుంచి దేశంలోని ప‌లు ప్రధాన నగరాలకు రైళ్లను నడిపించడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. లిమిటెడ్ స్టాప్స్‌తో ఈ రైళ్లను నడుపనున్నారు. ప్రస్తుతం ఏసీ రైళ్లను మాత్రమే న‌డిపేందుకు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బోగీలలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ రైళ్లను మరికొంత కాలం నడిపించకపోవడమే మంచిదని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సూచన చేశారు. మరి కొంత మంది సీఎంలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా రైల్వే టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైనట్లు రైల్వే శాఖ ప్రకటించింది.Source link

0 0
Next Post

Visakhapatnam gas leak | IAF airlifts 8.3 tonnes of chemicals

The India Air Force on Monday airlifted 8.3 tonnes of chemicals from Gujarat that could reduce the toxicity of the gas leaked from a storage tank at the LG Polymers plant in Visakhapatnam last week, the Defence Ministry said. The vapour leak from the plastic-manufacturing unit in the early hours […]