గుజరాత్‌లో రెండో కరోనా మరణం..

admin
Read Time1 Minute, 48 Secondబారిన పడి అహ్మదాబాద్‌లో 85 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవలే ఆమె విదేశాలకు వెళ్లి వచ్చారని.. అనారోగ్యం కారణంగా మార్చి 22న సివిల్ హాస్పిటల్‌లో చేరారని తెలిపారు. ఆమె చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఇది గుజరాత్‌లో నమోదైన రెండో కరోనా మరణం కావడం గమనార్హం. మార్చి 22న 67 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా సూరత్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

కరోనా బారిన పడి బుధవారం మధ్యప్రదేశ్‌లోనూ 65 ఏళ్ల వృద్ధురాలు చనిపోయారు. తమిళనాడులోనూ 54 ఏళ్ల కోవిడ్ పేషెంట్ చనిపోయారు. ఈ రాష్ట్రాల్లో నమోదైన తొలి కరోనా మరణాలు ఇవి. కాగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 12 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. ముంబై, గుజరాత్‌ల్లో ఇద్దరు చనిపోగా.. కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్‌లో ఒకరు చొప్పున మృతి చెందారు.

దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 607కు చేరగా.. తెలంగాణలో 41 మంది, ఏపీలో 10 మంది కోవిడ్ బారిన పడ్డారు. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది.Source link

0 0
Next Post

up workers 80 km walk : లాక్‌డౌన్: ఇంటికెళ్లడానికి కూలీల 80 కి.మీ. కాలినడక - up unnao labourers 80 km long walk to reach home amid coronavirus lockdown

కరోనా వైరస్‌ కట్టడికి మోదీ సర్కార్ దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో యూపీలోని ఉన్నావ్‌లో ఓ ఫ్యాక్టరీ తన వద్ద పనిచేస్తున్న కూలీలను ఉన్నపళంగా వెళ్లిపొమ్మంది. తమ ఇంటికి వెళ్లడానికి ఎలాంటి రవాణా సదుపాయం లేక ఆ కార్మికులు చివరికి కాలినడకను ఎంచుకున్న విషాదమిది. విధిలేని పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చామని.. రోడ్లపై ఎలాంటి వాహనాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నడిచి ఇంటికి వెళ్లాలని […]