గన్నవరంలో లోకేశే కాదు వాడి బాబు కూడా పోటీ చేయొచ్చు.. వంశీ సవాల్

admin
Read Time3 Minute, 41 Secondవైఎస్ఆర్సీపీలో చేరతానని ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే .. మరోసారి చంద్రబాబు, టార్గెట్‌గా ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు పంపేంత సీనేమీ లేదన్న వంశీ.. టీడీపీకి తనే రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరోసారి లోకేశ్‌‌ను టార్గెట్ చేసిన వల్లభనేని వంశీ.. తాను టీడీపీని వీడితే నష్టం లేదని.. లోకేశ్ ఉంటేనే నష్టమని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో పప్పు ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. టీడీపీకి లోకేశ్ ఓ పెద్ద గుదిబండ, స్పీడ్ బ్రేకర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఆస్తులను కాపాడుకొనేందుకే తాను పార్టీ మారినట్టుగా నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. లోకేశ్‌లో ఫైరుందా, ఫైర్ మిషన్ ఉందా అని ఎద్దేవా చేశారు. పార్టీని నడపడానికి చంద్రబాబు కొడుకు అనేది తప్పితే.. లోకేశ్‌లో ఏం క్వాలిటీ ఉందని వంశీ ప్రశ్నించారు. లోకేశ్‌లా అమ్మను, అయ్యను అడ్డం పెట్టుకొని నేను ఎదగలేదంటూ.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు లేని రోజున లోకేశ్‌కు వాడి బతుకు తెలిసొస్తుందని.. వంశీ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాకు ఎక్కడ ఆస్తులున్నాయో, ఏ ఆస్తులను కాపాడుకొనేందుకు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశానో ఆధారాలు ఉంటే బయటపెట్టాలని లోకేశ్‌ను ఆయన డిమాండ్ చేశారు.

ఉపఎన్నిక వస్తే గన్నవరం నుంచి లోకేశ్, దేవినేని పోటీ చేసే యోచనలో ఉన్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. దమ్ముంటే గన్నవరంలో లోకేశ్ మాత్రమే కాదు.. వాళ్ల బాబు కూడా పోటీ చేయొచ్చంటూ వంశీ సవాల్ విసిరారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నారా లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

పది జన్మలెత్తినా నారా లోకేశ్.. జూనియర్ ఎన్టీఆర్‌ కాలేడని వంశీ ఎద్దేవా చేశారు. బఫూన్లు, కుక్క బిస్కెట్లు, బఫూన్‌గాళ్లను పక్కన పెట్టుకొని తనపై విమర్శలు చేస్తున్నారని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. లోకేశ్‌కు పాలు, పెరుగు, తోటకూర అమ్ముకోవడానికి హెరిటేజ్ ఉంది.. టీడీపీకే ఇంకేం లేదన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు లోకేశ్‌కు మధ్య నక్కకు, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని వంశీ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే లోకేశ్‌కు భయం, వణుకు, దడ అని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. నేను జగన్‌ను తిట్టింది నిజమే.. కానీ చంద్రబాబు గతంలో మోదీని తిట్టలేదా? మోదీ తల్లిని తిట్టలేదా? అని వంశీ ప్రశ్నించారు.Source link

0 0
Next Post

chile singer bare chest protest: రెడ్ కార్పెట్ మీద నడిచి, అందరి ముందూ టాప్ విప్పేసి.. సింగర్ అర్ధనగ్న నిరసన - chile singer mon laferte exposes her bare chest in latin grammys 2019 to protest against govt

పోలీసుల క్రూరత్వానికి నిరసనగా చిలీకి చెందిన ఓ సింగర్ టాప్‌ను విప్పేసి నిరసన చేపట్టారు. ‘‘చిలీలో టార్చర్ పెడుతున్నారు, రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు’’ అని రాసిన వ్యాఖ్యలను ఎలాంటి ఆచ్ఛాదన లేని తన ఛాతిని 36 ఏళ్ల మోన్ లెఫెర్టే బహిరంగంగా ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. చిలీలో గత కొద్ది రోజులుగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. కాలం చెల్లిన రాజ్యాంగం […]