కొత్తగా 75 మెడికల్ కాలేజీలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు

admin
Read Time2 Minute, 42 Secondదేశంలో కొత్తగా 75 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. వీటి నిర్మాణ్ని 2021-22 కల్లా పూర్తి చేయనున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే.. దేశంలో 15,700 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా పెరగనున్నాయి. కేబినెట్ భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌ గోయల్‌ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. దేశంలో నిపుణులైన వైద్యుల సంఖ్యను పెంచడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు తెలిపారు.

అసలు మెడికల్ కాలేజీలే లేని లేదా 200 పడకల హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో వైద్య కళశాలలను నెలకొల్పుతామని తెలిపారు. 300 పడకల ఆసుపత్రులు ఉన్న జిల్లా హాస్పిటళ్లకు ప్రాధాన్యం ఉంటుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.

తొలి దశలో 58 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని మలి దశలో 24, మూడో దశలో 75 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో తొలి దశకు చెందిన 39 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగతావి 2020-21 నాటికి పూర్తవుతాయి.

కోల్ మైనింగ్‌లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడంతోపాటు.. డిజిటల్ మీడియాలోకి 26 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2019-20 సీజన్‌కు గానూ షుగర్ ఎక్స్‌పోర్ట్ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. 60 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేస్తామని జవదేకర్ తెలిపారు.

చెరకు రైతులకు రూ. 6 వేల కోట్ల ఎగుమతి రాయితీలు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఆ రాయితీలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.Source link

0 0
Next Post

Venkaiah Naidu: పాకిస్థాన్‌తో యుద్ధంపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు, కేంద్రం అడుగులు అటువైపేనా? - vice president venkaiah naidu warns pakistan about kashmir issue

పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం గురించేనని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. బుధవారం వైజాగ్‌లో జరిగిన నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ అర్ధ శతాబ్ది ఉత్సవాల ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య పాకిస్థాన్ గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. భద్రతను పెంపొందించుకోవడం కోసమే భారత్ ఆయుధాలను సమకూర్చుకుంటోందన్న ఆయన.. పొరుగు దేశాలపై దాడి కోసం కాదన్నారు. భారత్ ఇప్పటి వరకూ ముందుగా […]