కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా.. బలపరీక్ష జరిగేనా!

admin
Read Time3 Minute, 54 Secondర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా కొనసాగింది. విశ్వాస పరీక్షను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ రమేశ కుమార్ నిర్ణయం ప్రకటించారు. ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష తీర్మానంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో గందరగోళ నెలకొంది. ప్రజల్లో సానుభూతి కోసం ఇరుపక్షాలు ప్రయత్నించినట్లు కనిపించింది. వాదోపవాదాలన్నీ పూర్తై స్పీకర్ బలపరీక్షకు ఆదేశిస్తారని దేశమంతా ఆసక్తిగా చూస్తుండగా.. ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది.

తమ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు కిడ్నాప్‌కు గరయ్యారని.. వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శివకుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సభ్యుల ముందు ఉంచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యేల కిడ్నాప్‌ అంశాన్ని స్పీకర్ రమేశ్ కుమార్ తీవ్రంగా పరిగణించారు. శుక్రవారం లోగా నివేదిక సమర్పించాలని హోంమంత్రిని ఆదేశించారు. బలపరీక్షను వాయిదా వేయడానికి కాంగ్రెస్, జేడీఎస్ కొత్త నాటకానికి తెర తీశాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా ఈ అంశంలో వాగ్వావాదం జరిగింది. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. సంకీర్ణ సర్కార్ తమ ఎమ్మెల్యేలను చిట్టచివరి వరకు బుజ్జగించే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది.

విప్‌ అంశంపై స్పష్టత వచ్చేంత వరకు విశ్వాస పరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కోరారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఆగాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు తమతో ఉన్న ఎమ్మెల్యేలు కనిపించకుండాపోయారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని శివకుమార్ కోరారు. ఎమ్మెల్యేలు జంతువులు కారని సీఎం కుమారస్వామి అన్నారు. తాను అధికారం కోసం తాపత్రయపడట్లేదని స్పష్టం చేశారు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా.. గురువారం 19 మంది సభ్యులు సభకు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 100 సభ్యుల బలం ఉండగా.. స్పీకర్‌కు నిర్ణయాత్మక ఓటు మాత్రమే ఉంటుంది. దీంతో వారి బలం 99గా ఉంది. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 102. బీజేపీకి 105 సభ్యుల బలం ఉండటంతో ఆ పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప ధీమాతో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన గవర్నర్‌ను కలిశారు. అర్ధరాత్రి అయినా సరే.. విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనని కోరారు.Source link

0 0
Next Post

From Bengaluru Resort To Mumbai Hospital, Row Over Shrimant Patil's Disappearance

Congress lawmakers in the house waved photos of Shrimant Patil, lying on a stretcher Bengaluru:  In a cloak-and-dagger exit worthy of the movies, Karnataka Congress lawmaker Shrimant Patil vanished from a resort near Bengaluru, where he had been staying with party colleagues, and resurfaced on a stretcher in Mumbai. The […]